గ్రామ సింహం తోక ఎన్ని సార్లు వంచినా.. తన బుద్ధి మార్చుకోదు అన్న విధంగా ఉంది పాక్ తీరు. కశ్మీర్ విషయంలో.. అంతర్జాతీయంగా భారత్‌ను దోషిగా నిలబెట్టేందుకు పాక్ చేసిన ప్రయత్నాలన్ని విఫలం కావడంతో.. భారత్‌ను ఇబ్బందికి గురి చేసే ఏ విషయాన్ని పాకిస్థాన్ వదులుకోవట్లేదు. భారత్‌పై కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది.
బాలాకోట్ దాడుల తర్వాత పాకిస్థాన్ తమ గగనతలంను భారత విమానాలకు పూర్తిగా మూసివేసింది. అయితే జూలై 16న తిరిగి తెరిచినప్పటికీ ఆ తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో మళ్లీ పాక్ ఆంక్షలు విధించింది. దీంతో ఇప్పటికే భారత్ నుంచి పాశ్చాత్య దేశాలకు వెళ్లాల్సిన విమానాలు తమ సర్వీసులను రద్దు చేశాయి. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేయడంతో భారత్‌పై పీకల్లోతు ఆగ్రహం పెంచుకుంది పాకిస్తాన్. ఇక అప్పటి నుంచి ఏ ఒక్క చిన్న అవకాశం దొరికినా భారత్‌ను అంతర్జాతీయ సమాజంలో దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించి బొక్కబోర్లా పడింది. ఈ క్రమంలోనే పిచ్చిప్రేలాపనలకు పోతోంది పాకిస్తాన్. కశ్మీర్ సాధనకోసం అవసరమైతే భారత్‌పై అణుయుద్దం చేసేందుకైనా సిద్ధమంటూ.. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పిచ్చి ప్రకటనలు చేశారు. ఇప్పటికే పాకిస్తాన్ నుంచి భారత్‌కు రైలు సర్వీసులు, బస్సు సర్వీసులు రద్దు అయ్యాయి. అంతేకాదు వాణిజ్య సంబంధాలను కూడా పాక్ వద్దనుకుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి