ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పోలీసు వ్యవస్థకు సంబంధించి మౌలిక సదుపాయాలన్నీ కూడా హైదరాబాద్‌లోని ఉండిపోయాయి. ఈ విషయంలో ఏపీ పోలీసు విభాగం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. నిధులలేమి, సిబ్బంది కొరత వల్ల ఆశించిన లక్ష్యాలను చేరుకోలేకపోతోంది.

 

 

అందుకే.. అవసరాలకు అనుగుణంగా పోలీసు విభాగం సమర్థతను పెంచేలా సహాయం చేయాల్సిందిగా అమిత్ షాను సీఎం జగన్ కోరారు. ఆంధ్రప్రదేవ్‌ ఫోరెన్సిక్ ల్యాబ్‌ ప్రాజెక్టును హోంమంత్రిత్వ శాఖ 2017లోనే ఆమోదించింది. అయితే.. ఇందులో రూ.152 కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉంది. 101.4 కోట్లు రాష్ట్రం భరించాలని నిర్ణయించారు. కానీ.. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ ప్రాజెక్టు మూతపడింది.

 

 

అలాగే.. స్టేట్‌ ఆపరేషనల్‌ కమాండ్, కంట్రోల్‌ సెంటర్, సెంట్రలైజ్డ్‌ డేటా సెంటర్, ఏపీ పోలీస్‌ అకాడమీ ఏర్పాటు కూడా పెండింగ్ లోనే ఉంది. తగిన నిధులు లేక ఇబ్బంది పడుతున్నాయి. ఇదే సమయంలో ఏపీలో మహిళలు, చిన్నారులపై నేరాలను గణనీయంగా తగ్గించేందుకు చరిత్రాత్మక చర్యలను జగన్ వివరించారు. దిశ చట్టం అమలుకు తీసుకున్న చర్యలు వివరించారు. విచారణను వేగంగా పూర్తిచేసి, నిర్దేశిత సమయంలోగా విచారణ చేసి శిక్షలు విధించడానికి గట్టి చర్యలు తీసుకున్నామని తెలిపారు.

 

 

ప్రత్యేక పోలీస్‌ స్టేషన్లు, ప్రత్యేక కోర్టులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకం, ఒన్‌ స్టాప్‌ సెంటర్లు ఏర్పాటు చేశామని, సరిపడా సిబ్బందితో వీటిని బలోపేతం చేశామని జగన్ అమిత్ షాకు వెల్లడించారు. ఇలాంటి ఏపీ దిశా చట్టానికి ఆమోదం తెలిపాల్సిందిగా కోరారు. మరి జగన్ కోరికలను అమిత్ షా తీరిస్తే.. ఏపీ పోలీస్ సూపర్ గా దూసుకుపోతుందనడంలో సందేహం లేదు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: