ఒకప్పుడు నగదు బ్యాంకు నుండి నగదు కావాలి అంటే బ్యాంకుకు వెళ్లి తీసుకునే వారు ఆ తర్వాత డెబిట్ కార్డులు వాడుకలోకి వచ్చిన తరువాత ఏటీఎంలో నుంచి తీసుకుంటున్నారు.. కానీ ప్రస్తుతం డెబిట్ కార్డుల కంటే క్రెడిట్ కార్డు వాడకం ఎక్కువైపోయింది. రోజురోజుకు క్రెడిట్ కార్డ్ వినియోగదారులు భారీగా పెరిగిపోతున్నాయి. అంతేకాదు అవసరం లేకుండా మీకు క్రెడిట్ కార్డు కావాలా  సార్ అంటూ బలవంత పెట్టి మరీ క్రెడిట్ కార్డులను ఇస్తున్నారు ప్రస్తుతం బ్యాంకు ప్రతినిధులు. ఎలాగో డబ్బులు లేకుండా క్రెడిట్ కార్డు యూస్ చేసుకోవచ్చు ఆ తర్వాత కట్టొచ్చు అనుకొని అందరూ క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇలా రోజురోజుకు క్రెడిట్ కార్డు వాడకం పెరిగిపోతూ వస్తోంది. 

 

 అయితే క్రెడిట్ కార్డుల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అదే స్థాయిలో సమస్యలు కూడా ఉంటాయి అనే విషయం తెలిసిందే. ఇక క్రెడిట్ కార్డు దగ్గర ఉంది కదా అని ఇష్టానుసారంగా క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే మాత్రం అప్పుల ఊబిలో పోక తప్పదు. దీంతో మీ క్రెడిట్ స్కోర్ కాస్త దెబ్బతిని మరే ఇతర బ్యాంకుల్లో రుణాలు కూడా దక్కని పరిస్థితి ఏర్పడుతుంది. కానీ క్రెడిట్ కార్డ్స్ ని తెలివిగా ఉపయోగిస్తే మాత్రం ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో చాలా క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఓకే బ్యాంకు వివిధ రకాల క్రెడిట్ కార్డులను తమ వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. అయితే బ్యాంకులు తీసుకొస్తున్న రెండు మూడు రకాల క్రెడిట్ కార్డులో ఏది  తీసుకోవాలి అనే విషయం వినియోగదారులకు కాస్త అయోమయంగానే ఉంటుంది.

 

 అయితే క్రెడిట్ కార్డ్ ఎంపిక సమయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కార్డు ప్రాతిపదికన మీరు పొందే ప్రయోజనాలు  ఎప్పటికప్పుడు మారతాయని విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం సిటీబ్యాంకు ఒక అద్భుతమైన ప్రయోజనాలున్న   క్రెడిట్ కార్డులు వినియోగదారుల కోసం అందిస్తోంది. ఈ కార్డు ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఇండియన్ ఆయిల్ సిటీ కార్డు  తొలి ఏడాదిలో 71 మీటర్ల పెట్రోల్ డీజిల్ ఉచితంగా పొందవచ్చు. రివార్డు  పాయింట్లను రెడీమ్  చేసుకోవడం వల్ల ఈ బెనిఫిట్స్ లభిస్తోంది. ఇకపోతే కార్డు ఫీజు వెయ్యి  రూపాయలుగా ఉంది. ఇక మీరు క్రెడిట్ కార్డు తీసుకున్న తర్వాత తొలి ఏడాదిలోనే 30 వేల వరకూ క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేస్తే ఈ ఫీజు మినహాయింపు ఉంటుంది. అంటే మీరు తీసుకున్న క్రెడిట్ కార్డు ఉచితంగానే లభిస్తోంది అన్నమాట. ఇక తొలి ఏడాదిలో ఇండియన్ ఆయిల్ సిటీ కార్డు  ద్వారా 4900 రూపాయల బెనిఫిట్ పొందవచ్చని సిటీ బ్యాంక్ పేర్కొంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: