దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 83కు చేరిన నేపథ్యంలో కేంద్రం  తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.  కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్కో కుటుంబానికి రూ.4లక్షలు చొప్పున ఇవ్వాలని డెసిషన్ తీసుకుంది. అలాగే కరోనా వైరస్ ను నోటిఫైడ్ విపత్తుగా(notificed disaster) ప్రకటించింది.   మొన్నటి వరకు భారత్ లో కేవలం కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. నిన్న, నేడు మరణాలు కూడా సంబవించాయి. ఇప్పటికే భారత్ లో కరోనా వైరస్ వల్ల ఇద్దరు మృతి చెందారు.  కర్నాటకలో ఒకరు, ఢిల్లీలో ఒకరు మృతి చెందారు. అయితే వీరిద్దరూ ఇద్దరూ వృద్ధులే. మన భారత దేశంలోనూ కరోనా కమ్మేస్తోంది.

 

క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య శనివారం(మార్చి 14,2020) నాటికి 83కి చేరింది.  చైనాలో వ్యాప్తి చెందిన ఈ కోరానా అతి తక్కువ సమయంలోనే ప్రపంచం మొత్తం విస్తరించింది.  ఈ వైరస్ ఎఫెక్ట్ వల్ల తుమ్ములు, దగ్గు, ఛాతి నొప్పి క్రమేనా మనిషి శ్వాస ఇబ్బందితో మరణం సంబవించడం  జరుగుతుంది.  కరోనా వైరస్ దెబ్బకి యావత్ ప్రపంచం వణికిపోతోంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అలాగే మరణాల సంఖ్యా పెరుగుతోంది.2019 డిసెంబర్ లో చైనాలోని వూహాన్ లో వెలుగుచూసిన కరోనా వైరస్  చైనాని అతలాకుతలం చేసింది.

 

గత కొన్ని రోజులుగా ఆర్థిక వ్యవస్థ పై కూడా ప్రభావం చూపిస్తుంది.  అంతే కాదు మాంసాహారులు ఛేదు వార్త వినే పరిస్థితి దాపురించింది.  అటు యూరప్ లో కరోనా మృతుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు లక్షా 45వేల 700ల మందికి కరోనా సోకగా వారిలో 5వేల 438 మంది చనిపోయారు. భారత్ లో కరోనా భయంతో.. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు మూసివేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: