ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బెజవాడ ప్రాంతం చాలా కీలకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ మరియు విభజన జరిగిన తర్వాత దాదాపు రాష్ట్ర రాజకీయాలను బెజవాడ ప్రాంతీయ రాజకీయాలు చాలా ప్రభావితం చేస్తుంటాయి. ఇదే ప్రాంతం నుండి చాలామంది మహామహులు తల పండిపోయిన రాజకీయ నాయకులు కీలకంగా రాణించడం జరిగింది. ముందునుండి బెజవాడ ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి చాలా ఫెవర్ గా ఉంటుంది. అయితే గత సార్వత్రిక ఎన్నికలలో జగన్ హవా చాలా గట్టిగా ఉండటంతో బెజవాడలో కూడా ఫ్యాన్ గాలి గట్టిగా విచింది. అయినా గానీ తెలుగుదేశం పార్టీ తరఫున కేశినేని నాని పార్లమెంట్ స్థానం గెలవటం విశేషం.

 

ఇటువంటి తరుణంలో బెజవాడలో ప్రస్తుతం లేడీస్ రాజకీయంతో అట్టుడుకుతోంది. పూర్తి మేటర్ లోకి వెళ్తే త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో నగర మేయర్ పీఠంపై టిడిపి పార్టీకి చెందిన ముగ్గురు మహిళలు నువ్వానేనా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వారు ఎవరు అంటే ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత‌, తూర్పు ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ స‌తీమ‌ణి అనురాధ‌, సెంట్ర ల్ నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా స‌తీమ‌ణి సుజాత‌.

 

ఈ ముగ్గురు విజయవాడ మేయర్ పీఠంపై కన్నేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదోవిధంగా పోటీగా నిలబడాలని...కరోనా వైరస్ ని బేస్ చేసుకుని ప్రజల సానుభూతి పొందడానికి అనేక సహాయ సహకార కార్యక్రమాలు చేస్తున్నారు. వాటికి సంబంధించిన వీడియోలను ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. పేదలకు నిత్య అవసరాలు ఇస్తూనే మరోపక్క కూరగాయలు కూడా అందించే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎవరికి వారు ఎక్కడా తగ్గకుండా అధినేత చంద్రబాబు దృష్టిలో పడటానికి దూసుకుపోతున్నారు. ఫ‌లితంగా ముగ్గురు మ‌హిళ‌ల మ‌ధ్య తీవ్రమైన పోటీ నెల‌కొంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: