ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇసుక విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇసుక పాలసీ దుర్వినియోగం అవుతున్నట్టు వార్తలు రావడం.... ఆన్ లైన్ లో నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడం.... కొందరు బల్క్ బుకింగ్ చేసుకోవడం వల్ల సామాన్యులకు అన్యాయం జరుగుతుందని వార్తలు రావడంతో ఇసుక విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. నిర్వహణ వైఫల్యం వల్ల జగన్ సర్కార్ పై ఇసుక పాలసీ విషయంలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. 
 
నిజంగా ఇసుక అవసరం అయిన వాళ్లకు అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వం ఫెయిల్ అవుతున్న మాట వాస్తవం. ఇసుక లభ్యం కాకపోవడం వల్ల భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతూ ఉండటంతో పాటు నిర్మాణ రంగం కుదేలవుతోంది. దీంతో సీఎం జగన్ గ్రామ, వార్డ్ సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించడంతో పాటు ఎడ్లబండ్ల ద్వారా ఫ్రీగా ఇసుక తెచ్చుకునే అవకాశం కల్పించారు. 
 
అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇసుక పాలసీ మరోసారి దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఎడ్లబండ్లు ఉన్నవాళ్లు ఇసుకను ఉచితంగా తీసుకొని వెళ్లి ఇసుక కొరత ఉన్న ప్రాంతాల్లో అమ్మే అవకాశం ఉంది. ఈ విధానం ద్వారా అధికారులు కూడా అవినీతికి పాల్పడే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఎవరైనా చేస్తే వారి విషయంలో కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం మార్పులు తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. 
 
ప్రభుత్వ ఉద్దేశం మంచిదే కాబట్టి గ్రామాల ప్రజలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ విధానం బదులు గ్రామాలకు గ్రామాల పరిధిలో, మండలాలకు మండలాల పరిధిలో, నగరాలకు నగరాల పరిధిలో డంపింగ్ యార్డులను ఏర్పాటు చేస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలా చేస్తే ఎటువంటి సమస్య రాదని ప్రభుత్వం ఈ విధంగా ఆలోచిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: