ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ప్రతి వర్గానికీ చేయూతనిచ్చే విధంగా ఎన్నో సంచలన సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ ప్రస్తుతం... ప్రజా ముఖ్యమంత్రిగా ముందుకు సాగుతున్నారు. అవినీతికి దూరంగా సంక్షేమానికి దగ్గరగా పాలన సాగిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 

 

 ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాజాగా వైయస్సార్ కాపు నేస్తం అనే పథకాన్ని ఈ  రోజు ప్రారంభించారు. కాపు బలిజ తెలగ ఒంటరి కులాలకు చెందిన మహిళల బ్యాంకు ఖాతాలో ప్రతి ఏటా ప్రభుత్వం వైయస్సార్ కాపు నేస్తం పథకం కింద 15000 జమ చేయనుంది. అయితే తాజాగా ఈ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... ఇప్పటికే అర్హులైన ప్రతి ఒక్కరికి ఖాతాలో 15 వేల రూపాయలు జమ చేశారు. దీంతో లబ్ధిదారులు అందరూ వైయస్సార్ కాపు నేస్తం పథకం పై హర్షం వ్యక్తం చేశారు. 

 

 ఇదే సమయంలో వైయస్సార్ కాపు నేస్తం పథకం కోసం అర్హత ఉండి ... ఈ పథకం లబ్ధిదారుల జాబితాలో లేని వారికి కూడా ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించింది. వైయస్సార్ కాపు నేస్తం పథకానికి అర్హత ఉండి జాబితాలో పేర్లు లేనివారు ఈ పథకం కోసం గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆ తర్వాత దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించి ఆమోదించి... అర్హులైన వారికి జూలై నెలలో ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. కాగా 45 నుంచి 60 సంవత్సరాలు ఉన్న మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా ఉంటారు..?

మరింత సమాచారం తెలుసుకోండి: