టీవీ9.. తెలుగులో నెంబర్ వన్ టీవీ ఛానల్.. ఇది దాదాపు 17 ఏళ్ల క్రితం ఆ ఛానల్ పెట్టినప్పటి నుంచి అదే రికార్డ్ మెయింటైన్ అవుతోంది. అయితే కాస్త ఇటీవల టీవీ9కు చెడు శకునాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి ఈ ఛానల్ ను మైహోం రాజేశ్వరరావు అండ్ కో టేకప్ చేసినప్పటి నుంచి ఛానల్‌ లో అంత దూకుడు కనిపించడం లేదు. అదే సమయంలో రేటింగ్ చార్టుల్లోనూ డౌన్ ఫాల్ కనిపిస్తోంది.



అంతే కాదు.. చానల్ చేతులు మారుతున్నప్పటి నుంచి నిరంతరం సంచలన కథనాలు అందించే టీవీ9 తాను కూడా తరచూ ఓ వార్తాంశం అవుతోంది. టీవీ9 నుంచి రవిప్రకాశ్ వెళ్లిపోవడం, ఆయనపై టీవీ9 ప్రస్తుత యాజమాన్యం కేసులు పెట్టడం.. కోర్టు కేసులు.. అలా ఏదో ఒక ఇష్యూ వార్త అవుతోంది. ఇటీవల కాలంలో ఆ ఛానల్‌లో రెండు శిబిరాల నాయకులైన రజినీకాంత్, మురళీ కృష్ణ మధ్య విబేధాలు తీవ్రమయ్యాయని వార్తలు వచ్చాయి.



ఇంకేముందు రజినీకాంత్ ను కూడా పంపించేస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి. కానీ.. ఆ తర్వాత అలాంటిదేమీ జరగలేదు. ఇటీవల టీవీ9 సంస్థ నష్టాల్లో ఉందంటూ వార్తలొచ్చాయి. పాత కాపు రజినీకాంత్ మళ్లీ టీవీ9ను నేనే కొనేస్తాను..లాభాల్లోకి తెస్తానంటూ ముందుకొస్తున్నాడనీ వార్తలొచ్చాయి. ఇప్పుడు లేటెస్టుగా టీవీ9 చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సింగారావు రాజీనామా చేశాడని వార్తలు వస్తున్నాయి. ఈ సింగారావు యాజమాన్యానికి బాగా కావలసిన వ్యక్తి.



మరి అతను ఎందుకు టీవీ9కు రాజీనామా చేస్తున్నాడు.. ఆయన ఇకపై కేవలం 10 టీవీకి మాత్రమే పరిమితం అవుతాడని అంటున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంత వరకూ నిజం ఉందో అర్థం కావడం లేదు. టీవీ9లో పెద్ద తలకాయల బలాబలాలు అంత త్వరగా మారిపోతున్నాయా అన్న పరిస్థితి కనిపిస్తోంది. మరి అసలు టీవీ9లో ఏంజరుగుతుంది అన్నది ఇప్పుడు మీడియా సర్కిల్‌లో చర్చకు దారి తీస్తోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: