విశాఖ అంటే టీడీపీ అడ్డా.. జగన్ ప్రభంజనంలో కూడా ఈ విషయం స్పష్టం గా తెలిసిపోయింది.. అందుకే కాబోలు జగన్ విశాఖ మీద పట్టు కోసం రాజధాని ని అక్కడికి మార్చారు.. అంతేకాదు రాధాదాని వ్యవహారం అక్కడి నేతలకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది..అందుకే విశాఖ లో టీడీపీ కి ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితి ఎదురయ్యింది. పార్టీ చెప్పినట్లు అమరావతి కి సై అందామా అంటే ఇక్కడ ప్రజలు ఊరుకునేలా లేరు.. పోనీ ప్రజలు చెప్పినట్లు విశాఖ కే కట్టుబడి ఉందామా అంటే పార్టీ లో చోటు ఉండేలా లేదు.. దాంతో ఏం చేయాలో తెలీక మిన్నకుండిపోయారు..

పైనుంచి చంద్రబాబు ఒత్తిడి తో వారు పార్టీ మారే ఆలోచన చేస్తున్నారంటే వారు ఎంత తీవ్ర ఒత్తిడి లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.. విశాఖ లో రాజధాని రావొద్దని ప్రజలను నేతలు మోటివేట్ చేయాలట. అది జరగని విషయం అని అందరికి తెలుసు.. కానీ చంద్రబాబు మోడీ వైఖరితో విసిగిపోయిన చాలామంది టీడీపీ నేతలు ఇతర పార్టీ లకు వెళ్లిపోతున్నారు.. విశాఖ‌లో గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ గెలుపు గుర్రం ఎక్కింది. ఈ నలుగురు టీడీపీ తరపున తమ తమ ప్రాంతాల్లో చక్రం తిప్పుతున్న వారే.. అయితే పార్టీ ఓటమి దగ్గరినుంచి పెద్దగా టీడీపీ తో సంబంధాలు లేనట్లు కనిపిస్తున్నారట..ఇప్పటికే విశాఖ లోని నలుగురు ఎమ్మెల్యేలలో ఇద్దరు వైసీపీ పంచన చేరిపోయారు. మరో ఇద్దరు మిణుకుమిణుకు మంటున్నారు.. ఇవాళో రేపో ఎదో ఒక పార్టీ కి వెళ్లిపోయి టీడీపీ చెర నుంచి తప్పిచుకుందామని అనుకుంటున్నారు..

ఈ క్రమంలో విశాఖ లో వైసీపీ పట్టు బిగుస్తుంది అంటున్నాయి రాజకీయ వర్గాలు..  వైసీపీ ప్ర‌భుత్వం చేప‌డుతున్న సంక్షేమ ప‌థ‌కాలు, టీడీపీ అనుస‌రిస్తున్న విధానాల‌తో సీన్ రివ‌ర్స్ అయింది. జ‌గ‌న్ పాల‌నా రాజ‌ధానిగా విశాఖ‌ను ప్ర‌క‌టించిన అనంత‌రం ఉత్త‌రాంధ్ర అంతా ఆయ‌న‌కు జై కొడుతోంది. అంతేకాదు... విశాఖ న‌గ‌రంలో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు సైతం వైసీపీ కే జై కొట్టాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. చంద్ర‌బాబు అమ‌రావ‌తి పోరాటంతో విశాఖ‌లో తెలుగుదేశం ప‌రిస్థితి శూన్యంగా మారింది. కేడ‌ర్ కూడా దూరం అవుతోంది. చంద్ర‌బాబును అభివృద్ధి నిరోధ‌కుడిగా స్థానికులు చాలా మంది భావిస్తున్నారు. ఈ ప‌రిణామాలే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీ వైపు దృష్టి సారించేలా చేస్తున్నాయి. ఏ విధంగా చూసినా వైసీపీ విశాఖ‌లో తిరుగులేని శ‌క్తిగా అవ‌త‌రిస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

మరింత సమాచారం తెలుసుకోండి: