ఆధునిక జీవన శైలి కారణం గా పర్యావరణ కాలుష్యం రోజు రోజుకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. కాగా  ప్రస్తుతం పర్యావరణ కాలుష్యం విషయం లో ఏ మాత్రం జాగ్రత్త తీసుకోక పోయినా భవిష్యత్తు తరాలకు జీవన మనుగడ మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉందని అధికారులు ఎప్పటికప్పుడు ఇస్తున్నారు.  ముఖ్యం గా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి అని అధికారులు ఎప్పటికప్పుడు ప్రజల కు అవగాహన చర్యలు చేపడుతున్నారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో నే కొంతమంది అధికారులు ప్రజలు ప్లాస్టిక్ నిషేధించాలంటూ కఠిన ఆంక్షలు కూడా విధిస్తున్న  విషయం తెలిసిందే.



 హర్యానా రాష్ట్రం లోని అంబాల  నగర మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు  సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పాలిథిన్ బ్యాగుల వినియోగం విషయం లో నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు అధికారులు నవంబరు 1వ తేదీన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పాలిథిన్ బ్యాగుల వినియోగం పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రజలందరూ ప్లాస్టిక్ నిషేధించడం పై అధికారులు అందరికీ అవగాహన చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పాలిథిన్ బ్యాగుల ను  దుకాణాల లో ఎక్కువగా వినియోగిస్తుంటారు అనే విషయం తెలిసిందే.



 అయితే అధికారులు విధించిన నిబంధన ను ఉల్లంఘించి ఎవరైనా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పాలిథిన్ బ్యాగుల వినియోగిస్తే  కఠిన చర్యలు తప్పవు అంటూ హెచ్చరించారు. వినియోగ దారులు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పాలిథిన్ బ్యాగుల ను  తిరస్కరించాలంటూ సూచించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పాలిథిన్ బ్యాగుల ను  వినియోగిస్తే భారీ జరిమానాలు తప్పవు  అంటూ అంబాల మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలు అందరూ తమకు సహకరించాల ని అంటూ ఈ సందర్భం గా అంబాల కార్పొరేషన్ అధికారులు కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: