తెలంగాణ సీఎం కెసిఆర్ గ్రేటర్ ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడం తో పాటు, నామినేషన్ల గడువు ముగిసింది. మరికొద్ది రోజుల్లో ప్రచార గడువు ముగిస్తే, డిసెంబర్ ఒకటో తేదీన పోలింగ్ మొదలవుతుంది. ఇక ఆ తరువాత ఫలితాల వెల్లడి ఉంటుంది. ఇలా ఎలా చూసుకున్నా మరికొద్ది రోజుల్లోనే గ్రేటర్ జెండా ఎగరబోయేది ఎవరు అనేది స్పష్టం కాబోతోంది. దీంతో అన్ని పార్టీల్లోనూ టెన్షన్ నెలకొంది ఎవరికి వారు ఇక్కడ పైచేయి సాధించాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. దుబ్బాక ఎన్నికల్లో విజయం సాధించడంతో బిజెపి మంచి జోరు మీద ఉంది. ఎలా అయినా గ్రేటర్ పీఠం దక్కించుకోవాలి అని చూస్తోంది.
జనసేన
పార్టీ పోటీ నుంచి విరమించడం పూర్తిగా బీజేపీకి మద్దతు పలకడం వంటివి తమకు కలిసి వస్తాయని
బిజెపి భావిస్తోంది. ఇదిలా ఉంటే గ్రేటర్ ఎన్నికలపై కెసిఆర్ కు ఇంకా భయం పోలేదనే విషయంపై చర్చ జరుగుతోంది. వాస్తవంగా జనవరిలో గ్రేటర్ ఎన్నికలు నిర్వహించాలని దుబ్బాక ఎన్నికల ఫలితాలు తర్వాత
కేసీఆర్ భావించారట. కానీ అప్పుడు వరకు సమయం ఇస్తే,
బిజెపి మరింతగా బలపడుతుందని కాస్త ముందుగానే ఎన్నికలు పెడితే అప్పటికీ
బిజెపి గ్రేటర్ లో బల పడలేదు అనే విషయం గ్రహించారు.
ముందుగానే ఎన్నికలకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు మరింత కాలం గడువు పెంచితే అప్పటికి
బిజెపి బలం పెంచుకుని తమకి సవాలు విసిరే స్థాయికి వస్తుందని, అదే అనుకున్న దానికంటే ముందుగా అయితే అభ్యర్థుల ఎంపిక , ప్రచారం ఇలా అన్ని విషయాల్లోనూ బీజేపీకి ఇబ్బందులు ఏర్పడతాయనే ఉద్దేశంతో
కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే
జనవరి అని ముందుగా అనుకున్నా, దానికంటే ముందుగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు సమాచారం.