బోర బండ బస్టాండ్ దగ్గర బీజేపీ బోరబండ 102 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సభ  జరిగింది. సభకు ముఖ్య అతిథి గా హాజరయిన బీజేపీ కోర్ కమిటీ సభ్యులు.. మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి.. పలువురు బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసారు. పది వేల రూపాయలు ఇస్తామని జెప్పి  ప్రజలను టిఆర్ఎస్  ప్రభుత్వం మోసం చేసిందని ఆయన విమర్శలు చేసారు.  బీజేపీ గెలువగానే  వరద బాధితులకు జన్ ధన్ ఖాతాల్లో 25 వేలు వేస్తాం అని ఆయన స్పష్టం చేసారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కమిషన్లు దోచుకుని  కేసీఆర్ కుటుంబ సభ్యలకు ఫామ్ హౌస్ లు కట్టించాడు అని ఆయన పేర్కొన్నారు. పేదలు డబల్ బెడ్రూం లేక రోడ్ల మీద పడితే కల్వకుంట్ల ఫ్యామిలీ  కి మాత్రం  కేసీఆర్ ఫామ్ హౌస్ లు కట్టిస్తున్నాడు అని మండిపడ్డారు. హైదరాబాద్ నగరానికి ఎం చేశారని తండ్రి కొడుకులు నగరంలో అన్ని చోట్ల ఫోటోలు ఫోటోలు పెట్టుకున్నారు అని ఆయన మండిపడ్డారు.  కల్వకుంట్ల కమిషన్ రావ్ ను ఈ ఎన్నికల్లో ప్రజలు ఓడించి చెంపదెబ్బ కొట్టాలి అని ఆయన పిలుపునిచ్చారు.

బీజేపీ కి వస్తున్న ఆదరణ చూసి ఎన్నికలు వాయిదా వేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడు అని ఆయన మండిపడ్డారు. ఎల్బీ స్టేడియం సభలో కేసిఆర్ కొత్తగా చెప్పింది ఏమీ లేదు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. బోర బండ డివిజన్లలో చాల మంది విధి వ్యాపారులు ఉన్నారు వారికి ప్రధాన మంత్రి స్కీమ్ కింద పదివేల రూపాయలు అందిస్తాం అని ఆయన స్పష్టం చేసారు.  బోరబండ డివిజన్  బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ ను భారీ మెజార్టీ తో గెలిపించాలి అని ఆయన కోరారు. కార్యకర్తలు కూడా భారీగా వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: