ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్ప  స్థాయికి తగ్గిపోయాయి. అలాగే కరోనా మరణాలు కూడా  భారీగా తగ్గిపోయాయి.ఇక  డిశ్చార్జిల సంఖ్య అయితే కూడా చాలా స్వల్పంగా తగ్గాయని చెప్పాలి. సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్లో  విడుదల చేసింది‌. గడిచిన 24 గంటల్లో 43,006 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 316 మందికి కరోనా వైరస్ పాజిటివ్ ‌గా నిర్ధారణ అయింది. ఇక దీంతో  రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 8,72,288కి చేరింది.

అలాగే కరోనా మరణాలు కూడా భారీగా పడిపోయాయి. సోమవారం కరోనా బారిన పడి ఐదుగురు మంది మరణించారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురంలో ఒకరు, కడపలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,038కు చేరుకుంది.

ఇక  రాష్ట్రంలో డిశ్చార్జిల సంఖ్య కూడా స్వల్పంగా తగ్గిపోయిందని తెలిపింది. సోమవారం 595 మంది కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోవటం జరిగింది. దీంతో ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో  8,59,624 మంది కరోనా వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 5,626కు తగ్గి పోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,04,53,618 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో తెలపటం జరిగింది.ఇక ఇలాంటి మరెన్నో కరోనా వైరస్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: