రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకు ఉన్న పరిస్థితి గతంలో ఏ నేత కు ఎదురుకాలేదనే చెప్పాలి..  రాష్ట్రంలో జగన్ రాజకీయం చంద్రబాబు ను మించిపోయింది. ఒకప్పుడు చంద్రబాబు చేసిన రాజకీయాలను మించి జగన్ ఎంతో చాకచక్యంతో రాజకీయం చేస్తూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు.. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ ని నామరూపాల్లేకుండా చేయడంలో జగన్ సక్సెస్ అయ్యాడు..అంతేకాదు టీడీపీ కోరలు ఎలా వంచలో అలా వంచుతూ వారి దర్పాన్ని, పేరును తీసేస్తున్నాడు..

ఇప్పటికే కొంతమంది ముఖ్య నేతలని జైలుకి పంపి మిగితా వారిని భయబ్రాంతులకు గురిచేసి ఎవరి నోర్లు మెదపకుండా చేశారు. అమరావతి భూకుంభ కోణాల విషయంలో చంద్రబాబు నే టార్గెట్ చేశారు. అంతేకాదు గత పాలనను విమర్శిస్తూ చంద్రబాబు రాష్ట్రంలోకి అడుగు పేట్టకునీయకుండా చేశారు. ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్ లో ఎక్కువగా గడుపుతున్నారు. అప్పుడో ఇప్పుడో వచ్చి మొసలి కన్నీళ్లు కారుస్తూ వెళ్ళిపోతున్నాడు. అయితే చంద్రబాబు కు జగన్ చేస్తున్న ఈ చర్యలు ఇంతకీ మింగుడుపడడంలేదు. దాంతో ఆయనలో ఫ్రేస్టేషన్ పీక్స్ లోకి వెళ్తున్నట్లుగా ఉంది.

తాజాగా అమరావతి పేరుతో నిర్వహిచిన సభలో కూడా బాబు మాటలు మరింత దిగజారినట్టు, ఫ్రేస్టేషన్ ఎక్కువయినట్లుగా కనిపిస్తోంది. ఏం పీకుతున్నావ్ అంటూ ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర అభ్యంతరకరమైనవిగా పలువురు భావిస్తున్నారు. సీఎంని ఫేక్ అంటూ పదే పదే విమర్శిస్తున్న చంద్రబాబు ఈసారి మరింతగా నోటికి పనిచెప్పాలని నిర్ణయించుకున్నట్టు అంతా అంచనా వేస్తున్నారు. తన పనుల ద్వారా ప్రజల్లో పట్టు సాధించడం సాధ్యం కాదని, తన మాటల ద్వారానైనా నిత్యం వార్తల్లో ఉండాలని ఆయన నిర్ణయానికి వచ్చారా అని పలువురు లెక్కలేస్తున్నారు. అంతేగాకుండా జమిలీ ఎన్నికల గురించి ప్రతీ సందర్భంలోనూ ప్రస్తావించడం ద్వారా తాను మళ్లీ అధికారంలోకి వచ్చేస్తున్నాననే భ్రమలో ఆయన ఉన్నారని కూడా భావిస్తున్నారు. ప్రజలంతా రాష్ట్ర సమస్యల గురించి , ప్రభుత్వం చేపడుతున్న పథకాల గురించి చర్చిస్తుంటే చంద్రబాబు మాత్రం రాబోయే ఎన్నికలు ఎన్ని నెలల్లో ఉన్నాయని మాత్రమే చూస్తుండడం విశేషంగా కనిపిస్తోంది. చంద్రబాబులో అసహనం స్థాయి మీరిపోయి ఆయన్ని మరింత అభాసుపాలుజేస్తున్నట్టు కొందరు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: