ఒకటి కాదు రెండు కాదు దాదాపు 95 ఏళ్లు బుల్లెట్ తన తలలో దాచుకున్న బతికిన మొనగాడు. అందుకే గిన్నిస్ బుక్ రికార్డుకు అర్హుడు అయ్యాడు. సాధారణంగా బుల్లెట్ గాయమైతే చనిపోతారు లేదా కొంతకాలం గాయాలతో ఉంటారు మొత్తానికి డాక్టర్లు బుల్లెట్ ను మాత్రం ఖచ్చితంగా తీయాల్సి ఉంటుంది. అంతెందుకు ఈ మధ్య ఉగ్రవాదులు ఓ ఎస్సై పై కాల్పులు జరపగా అతని తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. రెండు రోజుల కోమాలో ఉండి మృత్యువాత పడ్డాడు.  కానీ విలియం లాలిస్ పేస్ అనే వ్యక్తి ఏకంగా 95 సంవత్సరాలు బల్లెట్ తన తలలో దాచుకున్నడు. సాధారణంగా పిల్లలు ఆటలు ఆడుకోవడం మనకు తెలుసు అయితే కాలిఫోర్నియాలో 1917 లో కాలిఫోర్నియాకు చెందిన విలియం లాలిస్ పేస్ అతని అన్న కలిసి ఆడుకోవడానికి బయటికి వెళ్లారు. ఇద్దరూ కొద్దిసేపటి వరకూ ఎంచక్కా ఆడుకున్నారు.


మామూలుగా ఆడుకుంటే కిక్కేముందీ.. ఇంట్లోకి వెళ్లి నాన్న గదిలోని గన్ తెచ్చుకుందాం అన్నాడు విలియం అన్న. దానికి ఓకే చెప్పాడు విలియం. అంతే క్షణాల్లో ‘‘ .22 రైఫిల్’’తో ప్రత్యక్షమయ్యాడు వీరసోదరుడు.   దురదృష్టవశాత్తూ ఆ రైఫిల్ పెద్ద శబ్దం చేస్తూ పేలింది. గట్టిగా చెవులు మూసుకున్నారు అన్నదమ్ములిద్దరూ. అయితే కొద్దిసేపటికి విలియం చెవి నుంచి రక్తం కారడం ప్రారంభమైంది. అంతే.. స్పృహ కోల్పోయాడు. కళ్లు తెరచి చూసేసరికి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. అన్న పేల్చిన బుల్లెట్ విలియం తలలోకి దూసుకుపోయిందని చెప్పారు డాక్టర్లు. దాన్ని తీయడానికి వారెవరూ సాహసించలేదు. బుల్లెట్‌ని తొలగిస్తే విలియం ప్రాణాలతో ఉంటాడనే నమ్మకం తమకు లేదని చేతులెత్తేశారు.దీనివల్ల దృష్టి, వినికిడి శక్తిపై పడింది. కుడి కన్ను, చెవి పనిచేయడం మానేశాయి. అలా 95 ఏళ్లపాటు బతికిన విలియం 2012లో 103 ఏళ్లకు కాలం చేశాడు.  ఇతని గొప్పదనాన్ని గుర్తించిన గిన్నిస్ వారు 2006లో రికార్డు పుస్తకాల్లో చోటు కల్పించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: