ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు ఏ రేంజిలో పెరిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో స్మార్ట్ ఫోన్ ముట్టుకొని ఏదైనా వెబ్ సైట్ ఓపెన్ చేయాలన్నా కూడా భయపడే పరిస్థితి నెలకొంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే ఏకంగా కొంతమంది కేటుగాళ్ళు  కీలక సమాచారాన్ని తెలుసుకునేందుకు కొన్ని లింకులను పంపుతూ ఆకర్షించడం ఆ తర్వాత ఆ లింకు ఓపెన్ చేయగానే కీలక సమాచారాన్ని దొంగలించి ఖాతాలు ఖాళీ చేయడం లాంటివి చేస్తున్నారు.  అయితే సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విధంగా జనాల్ని బురిడీ కొట్టిస్తున్నారు.



 ఎప్పటికప్పుడు అటు పోలీసులు కూడా సైబర్ నేరగాళ్ల పై ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ ఇక జనాలను మోసం చేయడానికి వినూత్న మార్గాలను వెతుకుతున్నారు. కొన్ని కొన్ని సార్లు ఫోన్లు హ్యాక్ చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు.  అయితే ఫోన్ సాధారణంగానే ఎప్పటిలాగే పనిచేస్తున్నట్లు అనిపించినప్పటికీ కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు ద్వారా మీ ఫోన్ హ్యాక్ అయిందా లేదా అన్న విషయాన్ని తెలుసుకునేందుకు వీలు ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా ఫోన్ పర్ఫామెన్స్ సహా మరికొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని మీ ఫోన్ హ్యాక్ అయిందా లేదా అన్న విషయాలను వెంటనే తెలుసుకోవచ్చు అని చెబుతున్నారు.


 ఒకవేళ మీ మొబైల్ లో మీకు తెలియకుండానే మీకు అవసరం లేని అసంబంధమైన పాప్ అప్స్ వచ్చాయి అంటే ఇక మీ ఫోన్ హ్యాక్ గురైంది అని అనుమానించవచ్చు. అంతే కాదు మీ ఫోన్ లో మీకు తెలియకుండానే కాల్స్ మెసేజ్ వెళ్తే ఇక మీ ఫోన్ హ్యాక్ అయినట్టే. అంతేకాకుండా రెగ్యులర్ గా కాకుండా మీ ఫోన్లోని డేటా వినియోగం అసాధారణంగా ఒక్కసారిగా పెరగడం లాంటివి జరిగితే వెంటనే మీ ఫోన్ హ్యాక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక ఫోన్ హ్యాక్ కి గురయినప్పుడు బ్యాటరీ త్వరగా అయిపోతూ ఉండడం కూడా జరుగుతుందట. అంతేకాకుండా పర్ఫామెన్స్ లో కూడా మార్పు వస్తుంది అని చెబుతున్నారు నిపుణులు. మీ ఫోన్ లో మీకు తెలియని మీరు అనవసరమైన యాప్స్ డౌన్ లోడ్ అయి ఉండడం.  మీకు కాల్ సందేశాలు రాకపోవడం.. అంతే కాకుండా మీ సోషల్ మీడియా ఖాతా నుంచి మీకు తెలియకుండా పోస్టులు పెట్టడం లాంటివి జరిగితే మీకు ఫోన్ హ్యాక్ అయింది అని గుర్తించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: