పాకిస్తాన్ లో ఎప్పటి నుండో హిందువులపై అనేక అకృత్యాలు సాగుతున్నాయి. ఆఫ్ఘన్ ఆక్రమణ అనంతరం ఇది మరింత తీవ్రవంతం అయ్యింది. తాలిబన్ లు కూడా పాకిస్తాన్ తమదే అంటూ ఇటీవల బహిరంగంగానే అంటున్నారు. ఈ నేపథ్యంలో తెరపైకి వచ్చింది సింద్ అంశం. ఈ ఉద్యమ నాయకుడు షఫీ మహమ్మద్ బూర్ ఫాట్ మాట్లాడుతూ, మేము మీ సంస్కృతిలో భాగమే. ఇక్కడ మాపై అనేక దాడులు జరుగుతూనే ఉన్నాయి. మమ్మల్ని రక్షించాలి అని భారత్ ను కోరారు. మా ప్రాంతప్రజలకు మీ సహాయసహకారాలు చాలా అవసరం అని ఆయన భారతదేశానికి విజ్ఞప్తి చేశారు. ఈయన సింధు దేశ ఉద్యమ నాయకుడు షఫీ. ఈ సింధుని పాలించిన హిందూ బ్రాహ్మణ రాజా దాహిర్ మాత్రమే తమ హీరో అని, కానీ మహమ్మద్ బీన్ ఖాసీం కాదు. సింధుల పోరుకు భారతీయులు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.

ఒకప్పుడు ప్రత్యేకంగా ఉన్న సింధును పాక్ కుటిలత్వంతో ఆక్రమించిందని షఫీ అన్నారు. తమను పాలించింది, తమకు నాయకత్వం వహించింది కేవలం దాహిర్ మాత్రమే అని, ఖాసీం కాదని ఆయన స్పష్టం చేశారు. అందుకే ఇప్పుడు సింధు స్వేచ్ఛను కోరి పాక్ ఆధిపత్యం నుండి పోరాడుతుందని, భారత్ తమకు మద్దతుగా నిలిచి తమకు స్వేచ్ఛను ప్రసాదించాలని ఆయన అన్నారు. అలాగే భారత్ తమ దేశంలో సింధును కలుపుకుంటే మరీ మంచిదని ఆయన అన్నారు. ఈ విధంగా షఫీ బాహాటంగా మాట్లాడటం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలాంటి ఉద్యమం ఎప్పటి నుండో జరుగుతున్నప్పటికీ పాక్ దానిని ఎప్పటికప్పుడు అణిచివేస్తూనే ఉంది. పాక్ లో ఎప్పటి నుండో హిందువులకు స్వేచ్చలేకుండా పోయింది, దాష్టికాలకు హిందువులు బలైపోతూనే ఉన్నారు.

ఈ విషయాలను గ్రహించి సాయం చేయాలని షఫీ భారత్ ను బహిరంగంగానే కోరారు. చైనా మాదిరి పాక్ చుట్టూ ఉన్న ప్రాంతాలను ఆక్రమించుకొని ఆధిపత్యం చేస్తున్నట్టు మరోసారి ప్రపంచానికి షఫీ ద్వారా తెలిసింది అని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ చైనా స్వయంగా పాక్ వెనుక ఉండి ఇదంతా చూపిస్తూ ఉండొచ్చు, తద్వారా భారత్ ను మానసికంగా దెబ్బతీయడానికి ఆయా దేశాలు చేస్తున్న కుట్రలు కూడా అయిఉండవచ్చు అంటున్నారు వారు. ఒకవేళ భారత్ కలిపించుకుంటే దానిని వెంటనే యుద్ధసన్నివేశంగా మరల్చి, తమకు అనుకూలంగా భారత్ చర్యలను మార్చుకోవచ్చనేది చైనా-పాక్ పన్నాగం అయిఉండవచ్చు అంటున్నారు వారు. భారత్ కూడా దీనిపై స్పందించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: