జ‌గ‌న్ స‌ర్కారు మ‌రో వివాదంలో ఇరుక్కుంది. నూత‌న వేత‌న స‌వ‌ర‌ణ అస్స‌లు త‌మ‌కు ఆమోద‌యోగ్యం కాద‌ని పేర్కొంటూ ఇవాళ ఉద్యోగులు అంతా నిర‌స‌న స్వ‌రాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నారు.కొత్త స‌వ‌ర‌ణ వ‌ద్ద‌ని పాత విధానంలోనే జీతాలు కొన‌సాగించాల‌ని, కొత్త వేత‌న స‌వ‌ర‌ణ అనుస‌రించే విధంగా చేస్తే త‌మ‌కు న‌ష్టం త‌ప్ప లాభం లేద‌ని ఆవేద‌న చెందుతూ రోడ్డెక్కేందుకు ప్ర‌ణాళిక రూపొందిస్తున్నాయి.ఇదే స‌మ‌యంలో ఉద్యోగుల విష‌య‌మై ప్ర‌జ‌ల నుంచి కూడా తీవ్ర స్థాయిలో నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి.ఇప్పుడున్న ఆర్థిక నేప‌థ్యంలో జ‌గ‌న్ కు ఉద్యోగులు స‌హ‌క‌రించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంద‌ని వీరంతా హిత‌వు చెబుతున్నారు.
ఈ నేప‌థ్యంలో ఈ త‌రుణంలో ఉద్యోగులంతా ప్ర‌తిఘ‌టించేందుకు సిద్ధం అవుతున్నారు.రానున్న రోజుల్లో త‌మ‌కు న్యాయం ద‌క్క‌క‌పోతే స‌మ్మె చేసేందుకు కూడా సిద్ధ‌మేన‌ని అల్టిమేటం జారీ చేశారు.ఈ నేప‌థ్యంలో త‌గువు మ‌రింత తీవ్ర‌తరం అయింది ఇరు వ‌ర్గాల మ‌ధ్య! ఇప్ప‌టికే అర‌కొర ఆదాయం న‌డుమ ఉన్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌తో తాము ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్నామ‌ని,దీనిని సానుకూలంగా అర్థం చేసుకోవాల‌ని సీఎం జ‌గన్ చెప్పినా వినిపించుకునేందుకు వారు సుముఖ‌త వ్య‌క్తం చేయ‌డం లేదు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఉద్యోగులు అంతా త్వ‌ర‌లోనే స‌మ్మె చేసేందుకు సిద్ధం అవుతున్నారు.ఇటీవ‌ల ప్ర‌క‌టించిన పీఆర్సీ త‌మ‌కు స‌మ్మ‌తిగా లేద‌ని చెబుతూ,త‌క్ష‌ణ‌మే నిన్న‌టి వేళ వేత‌న స‌వ‌ర‌ణ‌కు సంబంధించి ఇచ్చిన జీఓలు నిలుపుద‌ల చేయాల‌ని కోరుతున్నారు వీరు.దీంతో పాటు కొత్త ప్ర‌క‌టించిన ఫిట్మెంట్ 23 శాతం అన్న‌ది త‌మ‌కు అస్స‌లు అంగీకారంలో లేద‌ని, ఐఆర్ 27శాతం చెల్లించి, ఫిట్మెంట్ ను మాత్రం 23 శాతం ఇవ్వ‌డం త‌గ‌ద‌ని కూడా వీరు గ‌గ్గోలు పెడుతున్నారు.అదేవిధంగా అద్దెభ‌త్యంలో కోత విధించ‌డం కూడా త‌మ హ‌క్కుల‌కు భంగం వాటిల్లింప‌జేయ‌డ‌మే అని చెబుతున్నారు.


కొత్త నిబంధ‌న‌లు ప్ర‌కారం ప్ర‌తి పదేళ్ల‌కు కాకుండా ప్ర‌తి ఐదేళ్ల‌కూ పీఆర్సీ ఇచ్చే విధంగా నిబంధ‌న‌లు స‌డ‌లించాలి వీరంతా కోరుతున్నారు.దీనిపై స‌చివాల‌య ఉద్యోగులు, ఇత‌ర ప్రాంతాల ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ చేప‌ట్ట‌నున్నామ‌ని కూడా చెబుతున్నారు.డిమాండ్ల సాధ‌న‌కు సంబంధించి ప్ర‌భుత్వం దిగి రాక‌పోతే తాము స‌మ్మె చేయ‌డం ఖాయ‌మ‌ని అన్నారు.ఇందులో భాగంగా ఇవాళ తామంతా బ్లాక్ డే ను నిర్వ‌హిస్తున్నామ‌ని,న‌ల్ల బ్యాడ్జీలు పెట్టుకుని విధుల‌కు హాజ‌రు అయ్యామ‌ని పేర్కొంటూ ఉద్యోగ సంఘాల నేత‌లు బండి శ్రీ‌ను మొద‌లుకుని ఇత‌ర నాయ‌కుల వ‌ర‌కూ ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: