భారత్ లో గుండెపోటుతో మరణించేవారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, మారుతున్న ప్రజల జీవన శైలి, వృత్తి వ్యవహారాలతో ప్రజలు గుండెపోటు ముప్పుని కొని తెచ్చుకుంటున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే 2030 నాటికి ప్రపంచంలో అత్యధిక గుండె సంబంధ వ్యాధులతో మరణించేవారి సంఖ్య ఎక్కువగా ఉన్న దేశంగా ప్రపంచంలోనే భారత్ నెంబర్-1 స్థానంలో ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కార్డియోవాస్కులర్‌ డిసీజ్‌ (CVD)తో మరణించేవారిలో నలుగురిలో ఒకరు భారతీయుడు ఉంటారని చెబుతున్నారు.

బెంగళూరులో జరిగిన హెచ్‌ఏఎల్‌ మెడికాన్‌-2022 సదస్సులో ఈ విషయాలు బహిర్గతం అయ్యాయి. గుండె సంబంధిత్ సమస్యలు యువత, మధ్యవయసువారిలో పెరగడం మరింత ఆందోళన కలిగించే విషయం. 2030 నాటికి ప్రపంచంలో గుండె సంబంధ మరణాల నమోదులో భారత్ దే మొదటి స్థానం అని అంటున్నారు హృద్రోగ వైద్యులు, నిపుణులు. దీన్ని ఎదుర్కోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారల అలవాట్లు చేసుకోవాలని, ఒత్తిడి తగ్గించుకోడానికి వ్యాయామం సహా ఇతర జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని అంటున్నారు.

భారత్ లో ముప్పు ఎందుకు ఎక్కువ.. దానికి తోడు మధుమేహుల సంఖ్య కూడా పెరుగుతోంది. వీటన్నిటికీ కారణం మారుతున్న ఆహారపు అలవాట్లే. అయితే వీటిని మార్చుకోవడం అంత సులువు కాదు. గతంలో భారతీయుల ఆహారపు అలవాట్లు భిన్నంగా ఉండేవి. రాను రాను అవి పాశ్చాత్యీకరణ చెందాయి. రెడీమేడ్, ఫాస్ట్ ఫుడ్ మన జీవనశైలిలో భాగం అవుతోంది. జంక్ ఫుడ్ కి అలవాటు పడుతున్న పిల్లలు, యువతలో రోగ నిరోధక శక్తి పాలు తక్కువగా ఉంటోంది. మరోవైపు శారీరక శ్రమ తగ్గిపోయింది. స్కూల్ స్థాయి నుంచి పిల్లలకు ఆట పాటలు కరువయ్యాయి. పిల్లల్ని కేవలం మార్కులు సాధించేందుకు మాత్రమే సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో తరగతి గదినుంచే మార్పు రావాలంటున్నారు నిపుణులు. మధ్యతరగతి ప్రజల్లో పెరిగిన ఆర్థిక స్థోమత వల్ల కూడా వారి ఆహారపు అలవాట్లలో విపరీతమైన మార్పులొచ్చాయి. ఇవన్నీ గుండె సంబంధిత వ్యాధులకు పరోక్ష కారణంగా నిలుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: