వైసీపీ ప్రకటించిన అభ్యర్ధుల జాబితా, కూటమిలోని టీడీపీ జాబితాను చూసిన తర్వాత సోషల్ ఇంజనీరింగ్ లో ఎవరు సక్సెస్ అయ్యారనే విషయం అర్ధమవుతోంది.  ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా  ఇప్పటి రాజకీయాల్లో పార్టీలన్నీ కులాలు, మతాల మధ్యే తిరుగుతోంది. ఏ కులానికి ఏ పార్టీ ఎన్ని సీట్లిచ్చింది, ఏ మతానికి ఎన్నిసీట్లిచ్చిందనేది కీలకమమైపోతోంది. ఆ కోణంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయినట్లే. ఇదే సమయంలో చంద్రబాబునాయుడు వెనకబడ్డారనే చెప్పాలి.





పోటీచేయబోతున్న అభ్యర్ధుల జాబితాలను పోల్చిచూసినపుడు ఎవరికైనా ఈ విషయం తెలిసిపోతుంది. పొత్తులు లేవు కాబట్టి జగన్ స్వేచ్చగా సామాజికవర్గాల సమతూకాన్ని పాటించారు. ఇందులో అసెంబ్లీ రిజర్వుడు స్ధానాలు పోను మిగిలిన ఓపెన్ కేటగిరీలో బీసీలకు 48 టికెట్లు కేటాయించారు. చంద్రబాబు 24 టికెట్లు మాత్రమే బీసీలకు కేటాయించారు. రెడ్లకు జగన్ 49 టికెట్లిస్తే, చంద్రబాబు 28 మందికి టికెట్లిచ్చారు. కమ్మోరికి వైసీపీ 9 టికెట్లిస్తే, చంద్రబాబు 28 మందికి టికెట్లిచ్చారు. కాపులకు జగన్ 22 టికెట్లిస్తే, చంద్రబాబు మాత్రం 8 మందికి మాత్రమే పోటీచేసేందుకు అవకాశమిచ్చారు.





ఇక బీసీల్లో 139 ఉపకులాల్లో అవకాశం ఉన్నవాటికి ఇద్దరు అధినేతలూ సీట్లు కేటాయించారు. ఏ కోణంలో చూసినా హోలుమొత్తంమీద బీసీలకు, కాపులకు చంద్రబాబుకన్నా జగనే ఎక్కువ సీట్లిచ్చినట్లయ్యింది. కాబట్టే సోషల్ ఇంజనీరింగ్ లో జగన్ సక్సెస్ అయ్యారని చెప్పకతప్పదు. పోయిన ఎన్నికల్లో కూడా బీసీలకు, కాపులకు జగనే మ్యాగ్జిమమ్ సీట్లిచ్చారు. దాని ఫలితమే అప్పటి ఎన్నికల్లో వైసీపీకి అఖండ విజయం సాధ్యమైంది.





మరప్పటి ఫలితాన్ని బట్టిచూస్తే రాబోయే ఎన్నికల్లో ఫలితాలు ఎలాగ ఉండబోతున్నాయన్ని విషయాన్ని అంచనా వేయటం కాస్త కష్టమే. ఎందుకంటే జగనేమో సోషల్ ఇంజనీరింగును, సంక్షేమపథకాల లబ్దిదారులను గట్టిగా నమ్ముకున్నారు. ఈ నమ్మకంతోనే 175కి 175 సీట్లు గెలవాలని, గెలుస్తుందని పదేపదే చెబుతున్నారు. చంద్రబాబేమో కూటమిలోని జనసేన, బీజేపీతో పాటు ప్రభుత్వ వ్యతిరేకతను మాత్రమే నమ్ముకున్నారు. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.







మరింత సమాచారం తెలుసుకోండి: