ఎలక్షన్స్ ఏవైనా సరే అందరి కన్ను ఉండేది ప్రధాన పార్టీల పైనే. ఇలాంటి సమయం లో కొన్ని చిన్న పార్టీలు తాము కూడా ఎన్నికల బరిలో ఉన్నాం అని చెప్పకనే చెబుతూ ఉంటాయి. ఇక ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు అదృష్టం కలిసి విజయం సాధిస్తే మరికొన్నిసార్లు.. ఆయా పార్టీల అభ్యర్థులు ఓటమితోనే సరిపెట్టుకుంటూ ఉంటారు. అది సరేగాని ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా.. ఇక ఇప్పుడు ఒక పార్టీ ఏకంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ లో 16 స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమైంది.


 అదేంటి తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు ఉంటే 16 స్థానాలలోనే ఎందుకు అనుకుంటున్నారు కదా. అయితే ఒక స్థానాన్ని తమ మిత్ర పార్టీ కి వదిలేసింది. ఇంతకీ ఆ పార్టీ ఏంటో తెలుసా దళిత క్రైస్తవ దండోరా రాష్ట్ర కమిటీ. కాగా పార్టీ జాతీయ కన్వీనర్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ పార్లమెంట్ ఎన్నికలలో 16 స్థానాలలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇక తమ మిత్ర పార్టీ అయిన మజ్లీస్ పార్టీ కోసం హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో ఇక పోటీని విరమించుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇటీవల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇక పార్టీ నేతలతో కలిసి 9 మంది అభ్యర్థుల వివరాలను ప్రకటించాడు ఆయన.



 ఇక త్వరలోనే రెండో జాబితా కూడా విడుదల చేస్తారట. ఇక తమ పార్టీ నుంచి ప్రకటించిన అభ్యర్థులందరూ కూడా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ ఎన్నికల సింహం గుర్తుపైనే పోటీ చేస్తారు అన్న విషయాన్ని చెప్పుకొచ్చారు ప్రొఫెసర్ వినోద్ కుమార్. అయితే ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు పార్లమెంట్ ఎన్నికలలో విజయం సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయ్. ఇలాంటి సమయంలో.. చిన్న పార్టీలు ఎంత మేరకు సత్తా చాటుతాయి అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: