YS వివేకా హత్య కేసు గురించి చాలా కాలం తరువాత సీఎం జగన్ పెదవి విప్పారు. అది కూడా తన సొంత జిల్లా కడపలోని ప్రొద్దుటూరు సిద్ధం సభలో ఆయన మాట్లాడుతూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు.హత్య చేసిన వారితోనే టీడీపీ దోస్తీ చేస్తూ వారికి మద్దతుగా నిలుస్తోందని జగన్ ఆరోపించారు. తన చెల్లెళ్ళు రాజకీయ తపనతోనే చంద్రబాబు వైపు నడుస్తున్నారని అన్నారు.వివేకా హత్యను చేసిన వారు బయట ఉన్నారని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఎవరు చేశారు ఎవరు చేయించారు అన్నది దేవుడికి కడప ప్రజలకు తెలుసని జగన్ చెప్పారు. ఇక తాను ఎరిగి మరచీ తప్పు చేయనని కడప ప్రజల సాక్షిగా జగన్ మోహన్ రెడ్డి పెద్ద ఒట్టు వేశారు ధర్మం న్యాయం అన్న వాటిని తాను నమ్ముతాను అని కూడా చెప్పారు.వివేకా హత్య కేసు పెద్ద మిస్టరీ గా మారిపోయింది. దాంతో పాటు విపక్షాలు అన్నీ కూడా జగన్ మీద విమర్శలు చేస్తున్నాయి.అందుకే జగన్ మోహన్ రెడ్డి పెదవి విప్పాల్సి వచ్చింది అని అంటున్నారు. అది కూడా తన కడప గడ్డ పైనే ఆయన మాట్లాడారు. ఆ తరువాత జరిగిన నంద్యాల సభలో జగన్ ఆ ప్రస్తావనే చేయలేదు.


ఇకపై ఆయన మాట్లాడుతారని అనుకోవడానికి కూడా లేదు. అయితే వివేకా సొంత కుమార్తె అయిన సునీత జగన్ మీద విరుచుకుపడ్డారు. సానుభూతి కోసం తన నాన్న పేరుని వాడుకుంటున్నారు అని ఆమె అన్నారు. హత్య చేసిన వాళ్లు దొరికినా సూత్రధారులు దొరకాలి కదా అని ఆమె లాజిక్ పాయింట్ తీశారు. జగన్ మోహన్ రెడ్డి పక్కన ఉన్న వారే సూత్రధారులని హత్య చేసిన దస్తగిరి చెప్పారు కదా వారిని ఎందుకు రక్షిస్తున్నారని ఆమె ప్రశ్నించారు.జగన్ మోహన్ రెడ్డి అయిదేళ్ల పాలనలో అసలు నిందితులను ఎందుకు పట్టుకోలేకపోయారని ఆమె ప్రశ్నించారు. వీటి మీద జగన్ తో చర్చకు తాను సిద్ధమని ఆమె అంటున్నారు. ఇదే విషయం మీద చంద్రబాబు నాయుడు కూడా చెల్లెళ్ళ ప్రశ్నలకు జగన్ మోహన్ రెడ్డి జవాబు చెప్పాలని రెట్టిస్తున్నారు. ఆ విధంగా వివేకా హత్య ఇష్యూని ఎన్నికల్లో హైలెట్ చేయాలని టీడీపీ చూస్తోంది అని అంటున్నారు.అయితే వివేకా హత్య కేసు ఈసారి ఎన్నికల్లో ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: