ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడేకొద్ది టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ మధ్య మాటలు తూటాల్లాగా దూసుకుపోతున్నాయి.ప్రచారంలో భాగంగా వైసీపీ చేస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర గురువారం తిరుపతి జిల్లాలో కొనసాగింది.ఆ సందర్భంగా జగన్ మాట్లాడుతూ చంద్రబాబు వృద్ధుల సంక్షేమాన్ని గాలికొదిలేసారని ఆయన వల్లనే పింఛన్ల కోసం వృద్దులు ఎండలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఇంటి దగ్గరకు వచ్చి పింఛన్ ఇచ్చే పరిస్థితిని చూసి చంద్రబాబు కళ్లు మండాయని అందుకే వృద్ధులను ఎండలో నిలబెట్టే పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. గత ఐదేళ్లుగా ప్రతి నెలా 1వ తేదీనే వాలంటీర్ల ద్వారా పింఛన్ అందించామని తెలిపారు. దీన్ని భరించలేక,జీర్ణించుకోలేక, అసూయతో పింఛన్‌లు అడ్డుకున్నారని ఆయనపై అసహనం వ్యక్తం చేశారు సీఎం జగన్.ఎవరు ఉహించని విధంగా వ్యూహాత్మకంగా నిమ్మగడ్డ రమేష్‌తో ఈసీకి ఫిర్యాదు చేయించారని అన్నారు.

అయితే ప్రస్తుత రాజకీయాలు చెడిపోయాయి, దిగజారిపోయాయని ఆయన ఆవేదన చెందారు. ఇంకోవైపు తాము చెబితేనే పింఛన్‌లు ఆగిపోయాయని టీడీపీ అభ్యర్థులు నిస్సిగ్గుగా చెప్పడం చాలా దారుణమన్నారు. పింఛన్ కోసం వెళ్లి ఎండ తీవ్రత తట్టుకోలేక 31 మంది వృద్ధులు ప్రాణాలు విడిచారని అన్నారు. వీరందరిని చంపిన హంతకుడు చంద్రబాబే అని మండిపడ్డారు. ఎవరూ ఆందోళన చెందవద్దని రానున్నది మళ్లీ మన ప్రభుత్వమేననిరెండు నెలలు ఓపిక పట్టండి అని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం వాలంటీర్ల వ్యవస్థపైనే చేస్తానని హామీ ఇచ్చారు. మళ్లీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని కీలక ప్రకటన చేశారు.

దీనికి కొంతమంది టీడీపీ నేతలు జగన్ చేసిన వ్యాఖ్యలని ఖండిస్తూ టీడీపీ పింఛన్లు పంచే విషయంలో అలాంటి పనీ ఎప్పుడు చేయలేదని, ముందు ముందు కూడా చేయబోదని పింఛన్ల పంపిణి టీడీపీ కావాలనే ఆపేసింది అనేటటువంటి వార్త టీడీపీపై వేసి ప్రజల్లో సానుభూతి పొందడానికి జగన్ చూస్తున్నారని అన్నారు.అసలు సీఎంగా తొలి సంతకం చేయడానికి ప్రజలు ఒప్పుకోవట్లేదని  రానున్న ఎలక్షన్స్లో జగన్ ని ఇంటికి పంపడం ఖాయం అని డానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: