ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావిడి ఎప్పుడో మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలలో ప్రచారంలో భాగంగా ఫుల్ బిజీగా ఉన్నారు.. టిడిపి నేత చంద్రబాబు ప్రజగళం పేరిట నియోజవర్గాలలో పర్యటిస్తూ ఉండగా వైసిపి నేత జగన్ మేమంతా సిద్ధం అనే పేరుట నియోజవర్గాలలో చుట్టేస్తున్నారు.. అభ్యర్థులు కూడా తమకు ఇచ్చిన నియోజకవర్గాలలో జోరుగా ప్రచారం చేస్తున్నారు.తాజాగా ఒక టిడిపి అభ్యర్థి ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా జై చంద్రబాబు బదులుగా ఏకంగా జై జగన్  అంటూ చెప్పడంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది.


ఈ సంఘటన కర్నూలు జిల్లాలోని పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలో చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పాణ్యం అసెంబ్లీ నియోజవర్గ టిడిపి అభ్యర్థిగా గౌరవ్ చరితారెడ్డి పేరును చంద్రబాబు ప్రకటించారు.దీంతో ఆమె నియోజకవర్గంలో చాలా జోరుగానే ప్రచారాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్తోంది. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ అక్కడ ఉండే స్థానికులను కూడా వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకుని మరి ఒక రోడ్డు షోలను చేస్తూ ఉన్నది. అక్కడ ఉండే టిడిపి కార్యకర్తలను సైతం ఉద్దేశిస్తూ మాట్లాడిన గౌరు చరితారెడ్డి.. తన ప్రసంగం చివరిలో జై చంద్రబాబు అనబోయి జై జగన్ అనేసింది.


దీంతో అక్కడున్న టిడిపి కార్యకర్తలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.. వెంటనే తన పొరపాటున గుర్తించిన చరితారెడ్డి జై చంద్రబాబు అంటూ తప్పును సరిదిద్దుకుంది. అప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  చరితా రెడ్డి మొదట్లో వైసీపీలోని కొనసాగారు.. ఈమె ప్రస్తుతం టిడిపిలో ఉన్నప్పటికీ ఈమె మనసంతా వైసీపీతోనే ఉందంటూ అక్కడ పార్టీ శ్రేణులు కొంతమంది వెల్లడిస్తున్నారు. 2014లో పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈమె వైసిపి పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.. 2019లో ఆమెకు సీటు రాలేదు.. ఈమె బదులుగా రాంభూపాల్ రెడ్డి వైసీపీ టికెట్ దక్కించుకున్నారు. దీంతో ఆమె వైసీపీని వీడి.. 2019 ఎన్నికలలో టిడిపి పార్టీ నుంచి నిలబడి ఓడిపోయారు. చరితారెడ్డి మాట్లాడిన  వీడియో కూడా వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: