ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీ పార్టీకి కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. వైవీ సుబ్బారెడ్డి తాజాగా మాట్లాడుతూ విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయాక అభాండాలు వేస్తున్నారని కోటరీ ఉందో లేదో అధికారంలో ఉన్న సమయంలో తెలీదా అంటూ కామెంట్లు చేశారు. మా పార్టీలో ఒకటి నుంచి 100 వరకు జగన్ మాత్రమేనని ఆయన అన్నారు. ప్రస్తుతం లిక్కర్ సహా అనేక అంశాలపై కేసులు పెడుతున్నారని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు.
 
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎలాంటి లిక్కర్ స్కామ్ జరగలేదని ఆయన తెలిపారు. మేము ఈ ఆరోపణలను కోర్టులో ప్రూవ్ చేసుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలు జగన్ కు కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విజయసాయిరెడ్డి జగన్ కు వ్యతిరేకంగా మారడం పార్టీకి తీవ్రస్థాయిలో నష్టం చేకూర్చే ఛాన్స్ అయితే ఉంది.
 
ఇప్పటికే కుటుంబ సభ్యులు జగన్ ను దూరం పెట్టారనే సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో కీలక నేతలు పార్టీకి దూరం అవుతుండటం కూడా పార్టీకి అన్ని విధాలుగా మైనస్ అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ కు పరిస్థితులు అన్నీ వ్యతిరేకంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో జగన్ ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తారో చూడాల్సి ఉంది.
 
జగన్ పాదయాత్ర దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని అలా జరిగితే మాత్రమే ప్రజల్లో జగన్ కు క్రేజ్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. సరైన సలహాదారులను నియమించుకుంటే మాత్రమే జగన్ కోరుకున్న లక్ష్యాలను సాధించే ఛాన్స్ ఉంటుంది. జగన్ ఇతర రాజకీయ నేతలకు భిన్నంగా కెరీర్ పరంగా ముందడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉంది.జగన్ రాష్ట్రంలో చక్రం తిప్పాలంటే పరిస్థితులు జగన్ కు అనుకూలంగా మారాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. విమర్శలను పట్టించుకోకుండా జగన్ ముందడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. జగన్ మళ్లీ సీఎం అవుతారో లేదో చూడాలి.





 


మరింత సమాచారం తెలుసుకోండి: