
ప్రజలు మనసులోని భావాలను చెప్పే హక్కు లేదా ?నా మనసు చాలా బాధ అవుతోంది.. ప్రజల పైన కేసులు పెడుతున్న ఈ పోలీసులు గుర్తుపెట్టుకోవాలి వచ్చేది కచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే.. ఆపడం ఎవరి తరం కూడా కాదని పోలీసులకు రాజకీయాలు ఎందుకు?.. పోలీసులు పోలీసులు పనే చేయాలి అంటూ హెచ్చరించారు.. బిఆర్ఎస్ కార్యకర్తలకు బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. ఇక పైన నేనే బయటికి వస్తాను అందరి తరపున పోరాడుతానంటూ తెలియజేశారు కేసీఆర్.
గ్యారెంటీగా పోలీసు మిత్రులారా ఈరోజు రాత్రి ఇంటిపై వెళ్లి మరి డైరీ రాసుకోండి తెలంగాణలో వచ్చిన ఈ పరిస్థితుల వల్ల మళ్ళీ 100% అధికారంలోకి టిఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని ఇది ఆపడం ఎవరి తరం కాదు అంటూ.. పోలీసులు ఉద్యోగాలు చేస్తున్నారా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నారా తెలియదు కాంగ్రెస్ వాళ్లు ప్రజలను మోసం చేయలేదా ఈ విషయంపై నిలదీస్తుంటే కేసులు పెడతారా అంటూ కేసిఆర్ మాస్ వార్నింగ్ ఇచ్చినట్లుగా వీడియోలు సైతం సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అంతేకాకుండా తమ పదేళ్ల అధికారంలో ప్రజలకు జరిగిన మంచి పనులను తెలియజేస్తూ సభను కూడా విజయవంతంగా పూర్తి చేశారు కేసీఆర్. తెలంగాణలో కాంగ్రెస్ నెంబర్ వన్ విలన్ అంటూ ఫైర్ అయ్యారు కెసిఆర్. అలాగే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎంత ఉంది అనే విధానం పైన కూడా కెసిఆర్ సభలో మాట్లాడడం జరిగింది.