ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునః ప్రారంభ కార్యక్రమం ఇవాళ జరుగుతోంది. అయితే ఈ కార్యక్రమం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్... దేశ ప్రధాని నరేంద్ర మోడీ మధ్య ఆసక్తికర సంఘటన జరిగింది. రాజధాని అమరావతి పునః ప్రారంభ కార్యక్రమం నేపథ్యంలో... స్టేజి పైన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పీచ్ అదరగొట్టారు. పాకిస్తాన్ దేశానికి వార్నింగ్ ఇస్తూనే ప్రధాని నరేంద్ర మోడీ పనితీరును మెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్.

అలాగే రాజధాని అమరావతిని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే దాని పైన కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్. అటు చంద్రబాబు నాయుడు పాలనను కూడా మెచ్చుకున్నారు. అయితే... డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పీచ్ అయిపోయిన తర్వాత.. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన పని అందరిని నవ్వించింది. కూర్చున్న పవన్ కళ్యాణ్ వెంటనే తన దగ్గరికి రమ్మని... ఓ చాక్లెట్ ఇచ్చాడు ప్రధాని నరేంద్ర మోడీ. స్పీచ్ అదరగొట్టావు బాసు... నువ్వు హీరోనే కాదు పొలిటికల్.. రోల్ మోడల్ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చుకున్నారు.

 అయితే పవన్ కళ్యాణ్ కు నరేంద్ర మోడీ చాక్లెట్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన.. జనాలు కూడా సంబరపడిపోతున్నారు. ఇది ఇలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని  అమరావతి పునః ప్రారంభ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ కాసేపటి క్రితమే వచ్చారు. ఈ సందర్భంగా దాదాపు 50 వేల  కోట్ల అభివృద్ధి పనులకు... శ్రీకారం చుట్టబోతున్నారు నరేంద్ర మోడీ. ఇలాంటి మహోత్తర కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి.. ఆహ్వానం అందినా కూడా డుమ్మా కొట్టి బెంగళూరు వెళ్ళిపోయారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు













మరింత సమాచారం తెలుసుకోండి: