
అయితే నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన సమయంలో మోడీ మాట్లాడిన తీరును చూస్తే ఎవరికైనా పలు రకాల అనుమానాలు కలగాక మానదు.. అమరావతి రాజధాని పనులు కేంద్ర సహకారం ఉంటుందంటూ చెప్పిన అంతవరకు బాగానే ఉన్నప్పటికీ నిధులు ఇస్తారేమో అని అందరూ ఆశించారు. కానీ ఎటువంటి నిధులు ఎత్తకుండానే కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి కూడా మద్దతు ఉందంటూ తెలియజేశారు. కానీ మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ,సీఎం చంద్రబాబు గత ఐదేళ్ల వైసిపి పాలన విమర్శిస్తూ రాజధానిని విధ్వంసం చేశారనే విధంగా మాట్లాడారు.
మూడు రాజధానుల ప్రతిపాదన జగన్ తీసుకువచ్చిన విషయం కూడా మోడీకి తెలుసు. కానీ నిన్నటి రోజున అమరావతికి వచ్చినప్పుడు సభలో మాత్రం ఒక్క మాట కూడా వైసిపి నేత మాజీ సీఎం జగన్ ని అనలేదు. అయితే ఇప్పుడు విమర్శలు చేయకపోవడంతో రాజకీయాలలో చర్చనీ అంశంగా మారుతున్నది. అన్ని రాష్ట్రాలలో కూడా బిజెపికి వ్యతిరేకంగా ఉండే పార్టీలను కూడా విమర్శించేవారు. ఆంధ్ర వచ్చేసరికి జగన్ ను విమర్శించలేకపోతున్నారనే విధంగా పలువురు నేతలు తెలియజేస్తున్నారు.
నిజానికి 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర విభజించడంతో ఏపీలో కాంగ్రెస్ విలన్ గా మారిపోయింది. దీంతో పదేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ పత్త లేకుండా పోతున్నది. ఇక ఉంది ఏపీలో వైసీపీ, టిడిపి పార్టీని. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని అవకాశం ఎవరికీ లేదు .. గతంలో కూడా మోదీకి జగన్ కి మధ్య మంచి స్నేహబంధం ఉన్నది. అందుకే మోది విమర్శలు చేయలేదని రాబోయే రోజుల్లో ఎవరి అవసరం ఉంటుందో తెలియదు కాబట్టి జగన్ పైన విమర్శలు చేయలేదని వార్తలు వినిపిస్తున్న తరుణంలో కూటమి నేతలు మాత్రం జగన్ ను పట్టించుకోవడం లేదంటూ అందుకే విమర్శలు చేయలేదని సర్ది చెబుతున్నారు.