తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు టాపిక్ మొత్తం కల్వకుంట్ల కవిత చుట్టే తిరుగుతోంది. జైలు నుంచి వచ్చిన తర్వాత రాజకీయాల్లో యాక్టివ్ అయిన కల్వకుంట్ల కవిత... కెసిఆర్ పార్టీనే ముంచేలా కనిపిస్తోంది. ఆమె తాజాగా విడుదల చేసిన ఓ లేఖ... ఉద్యమకారుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు మింగుడు పడడం లేదు. సొంత కూతురే ఇలా తిరుగుబాటు చేసిందని.... టెన్షన్ లో ఉన్నారట కల్వకుంట్ల చంద్రశేఖర రావు. అటు హరీష్ రావు, కేటి రామారావు కూడా కాస్త ఆందోళన గానే కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ ఓడిపోయిన తర్వాత... బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తోందని  తన తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ను లేఖ ద్వారా నిలదీసింది కల్వకుంట్ల కవిత. బిజెపి పార్టీ... సాఫ్ట్ కార్నర్ తో కేసీఆర్ వ్యవహరిస్తున్నారని... దానివల్ల పార్టీ నష్టపోతుందని గుర్తు చేశారు. అలాగే వరంగల్ సభ నేపథ్యంలో కేసీఆర్ ఒక్కరు మాత్రమే మాట్లాడటం పై... కల్వకుంట్ల కవిత అసంతృప్త స్వరం వినిపించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కు లేక కూడా రాశారు. అయితే ఆమె నిజంగానే లేఖ రాశారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

 ఈ లేఖ లీక్ కావడంతో... సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రచారం చేస్తున్నారు. 2001లో గులాబీ పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఉద్యమకారులు అందరినీ ఏకం చేసేందుకు కల్వకుంట్ల కవిత నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. వాళ్లందరినీ ఏకం చేసి.. కొత్త పార్టీని లీడ్ చేసేందుకు సిద్ధమయ్యారట కల్వకుంట్ల కవిత.  అలాగే బీసీ నినాదం ఎత్తుకున్న తీన్మార్ మల్లన్న లాంటి నేతలు అందరిని కలుపుకొని వెళ్లాలని అనుకుంటున్నారట. జూన్ రెండో తేదీన దీనిపై ప్రకటన కూడా రాబోతున్నట్లు సమాచారం అందుతుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

BRS