- ( హైద‌రాబాద్‌ - ఇండియా హెరాల్డ్ )

తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు ఇప్పుడా అని ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు అయినట్టు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. వీరిద్దరు క్యాబినెట్ విస్తరణ ... పిసిసి కార్యవర్గ కూర్పు పై అధిష్టానంతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. నీతి అయోగ్ పాలకమండలి సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ పలువురు కేంద్ర మంత్రులతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశంలో పాల్గొన్నారు. ఆయ‌న శనివార‌మే తిరిగి హైదరాబాద్ రావాల్సి ఉన్న ఆయన ఢిల్లీలోనే ఉండిపోయారు. పార్టీ పెద్దలతో చర్చలు జరపడంతో మరోసారి క్యాబినెట్ విస్తరణ పై ఊహాగానులు మొదలయ్యాయి. ఈసారి మంత్రివర్గ విస్తరణ పై చర్చలు కి వచ్చాయని ... మరోసారి ఢిల్లీ పెద్దలతో చర్చించాక తెలంగాణ క్యాబినెట్ విస్తరణ పై ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.


సోమవారం సాయంత్రం కూడా దీనిపై ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. హోం - విద్యాశాఖ వంటి కీలక శాఖలన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి. ఇక మంత్రుల లిస్ట్ కూడా రెడీ అయినట్టు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి - గడ్డం వివేక్ - నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి - రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి - ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు - కరీంనగర్ నుంచి ఆది శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి. మైనార్టీ కొటాలో షబ్బీర్ ఆలీ - అమిర్ అలీ ఖాన్ లో ఎవరో ఒకరికి అవకాశం ఉంటుంది. ఎస్టి కోటాలో బాలునాయక్ - శంకర్ నాయక్ మహిళా కోటలో విజయశాంతి పేర్లు తెరపైకి వస్తున్నాయి. మరి వీరిలో ఎవరికి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి పదవి దక్కుతుందో చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: