
డీఎస్సీ నోటిఫికేషన్ లో అనేక లోటుపాట్లు ఉండడంతో పాటు గందరగోళంగా ఉందని ఆయన విమర్శించారు. ఈ క్రమంలోనే డీఎస్సీ అభ్యర్థులతో పాటు నిరుద్యోగుల భవిష్యత్తు కోసం బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీన విజయవాడ ధర్నా చౌక్‌లో మహాధర్నాకు ఆయన పిలుపు ఇచ్చారు. అభ్యర్థుల పరీక్ష సన్నద్ధత కోసం కనీసం 90 రోజుల టైం కేటాయించాలని... నార్మలైజేషన్ ద్వారా ఒక్కో అభ్యర్థికి ఒక్కో పేపర్ కాకుండా.. జిల్లా అంతటా ఒకే పేపర్‌తో మాత్రమే పరీక్ష నిర్వహించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నార్మలైజేషన్ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తే ఉద్యోగం సాధించే నిజమైన అభ్యర్థికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఏడేళ్ల పాటు డీఎస్సీ లేకపోవడంతో వేలాది మంది నిరుద్యోగులు నష్టపోతున్నారని.. వీరి కోసం అర్హత వయస్సు 47 సంవత్సరాలకు పెంచాలని, ప్రస్తుతం బీఈడీ, డీఈడీ రాసిన అభ్యర్థులందరికి కూడా డీఎస్సీ రాసే అవకాశం కల్పించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు పై విషయాలపై రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఇవేం పట్టని వైఖరితో ప్రభుత్వం పరీక్షలు నిర్వహణకు ముందుకు వెళ్లడం తగదన్నారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణలో 90 రోజుల సమయం ఇవ్వడంతో పాటు నార్మలైజేషన్ పద్ధతి రద్దు చేసే వరకు బీసీవై పార్టీ నిరుద్యోగుల పక్షాన అలుపెరగని పోరాటం చేస్తుందని.. ఈ క్రమంలోనే విజయవాడలో జూన్ 2న చేపట్టే మహాధర్నా కార్యక్రమానికి అన్ని రాజకీయ పక్షాలతో పాటు ప్రజాసంఘాలు కలిసి వచ్చి నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేద్దామని ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ పిలుపు ఇచ్చారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు