ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీకి భారీ షాక్ తగలబోతోంది. ఆ పార్టీకి చెందిన కీలక నేత టిడిపి పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబు ఆ కీలక నేతకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.గతంలో వైయస్ జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే ఆనేత ఎవరు?. మరి ఆ నేతకు సీఎం చంద్రబాబు ఎలాంటి ఆఫర్ ఇచ్చారో ఇప్పుడు ఒకసారి చూద్దాం.



ఆంధ్రప్రదేశ్లో వైసిపి పార్టీకి వరుస దెబ్బలు తగులుతూ ఉన్నాయి.. ఇప్పటికే చాలామంది లీడర్లు ఫ్యాన్ పార్టీని వీడి ఇతర పార్టీలోకి చేరారు. దీంతో చాలా నియోజవర్గాలలో పార్టీ ముందుండి నడిపించడానికి లీడర్లే లేకుండా పోయారు.ఈ వ్యవహారంలోనే జగన్ వైఖరి నచ్చక కొంతమంది నేతలు పార్టీని వీడి వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం..త్వరలోనే ఒక ముఖ్య నేత కీలక ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం..గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నేత..వైసిపి పార్టీకి త్వరలోనే గుడ్ బై చెప్పబోతున్నారనే విధంగా వినిపిస్తోంది.


ఇప్పటికే వైసీపీ నుంచి మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి,సామినేని ఉదయభాను,రోశయ్య వంటి నేతలు వైసిపి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత విజయ్ సాయి రెడ్డి కూడా వైసిపి పార్టీకి రాజీనామా చేశారు. రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. జగన్ కి సన్నిహితంగా ఉన్న మోపిదేవి వెంకటరమణ కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. నలుగురు ఎంపీలు ఒక్కసారిగా రాజీనామా చేశారు..ఇంకా ఎవరు రాజీనామా చేసే అవకాశం లేదని జగన్ భావించారు.. అయితే ఇప్పుడు జగన్ దెబ్బకొట్టేందుకు మరొక ఎంపి సిద్ధమయ్యారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.


వైసిపి పార్టీని మరింత దెబ్బ కొట్టాలని టిడిపి కూడా భావిస్తోంది.ఇందులో భాగంగానే ఒక ఎంపీకి గాలం వేసినట్లుగా తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో రాజ్యసభ  పదవి పొందిన వారిలో ఒకరు టిడిపి నేతలతో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. ప్రస్తుతం వైసీపీకి 7 గురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అందులో వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, నిరంజన్ రెడ్డి, మేడ రఘునాథ్ రెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ , పరిమళ అద్వానీ కూడా ఉన్నారు. ఈ ఐదు మంది ఎంపీలలో ఒకరు టిడిపిలో చేరే అవకాశం ఉన్నదట. మహానాడు సభలోని ఆ ఎంపీ టీడీపీ పార్టీలో చేరడానికి సిద్ధమైన కొన్ని కారణాల చేత వాయిదా పడ్డట్టుగా తెలుస్తోంది. అయితే ఆ నేత దాదాపుగా టిడిపి పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుగు తమ్ముళ్లు తెలియజేస్తున్నారు..త్వరలోనే ఒక ఎంపీ స్థానం ఖాళీ అవుతుందని అతని స్థానంలో తిరిగి మళ్ళీ అతనిని పంపించాలనే కండిషన్ తోనే టిడిపి పార్టీలోకి చేరుతున్నారని సమాచారం. అలాగే కుటుంబంలో కూడా ఒకరికి కీలక పదవి ఇస్తామని టిడిపి తెలియజేసిందట. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటన కూడా రాబోతున్నదట. మరి ఆ నేత ఎవరో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: