ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న శైలి కొంతమందికి కన్ఫ్యూజన్ లో పడేలా చేస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ భార్య క్రిస్టియన్ అని తాను కూడా ప్రార్థనలు చేశానని అలాగే ముస్లిం సోదరులు అంటే తనకి గౌరవం ఉందని కూడా వెల్లడించారు. కుల మతాలు అన్నవి ప్రస్తావించకుండా అందరికీ సమన్యాయం జరిగేలా ఉండాలి అంటూ పవన్ కళ్యాణ్ ఎన్నో సందర్భాలలో మాట్లాడారు. అందుకే పవన్ కళ్యాణ్ ని సినిమాలలో కంటే వ్యక్తిగతంగా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. యూత్ అందుకే పవన్ కళ్యాణ్ కి బాగా కనెక్ట్ అవుతూ ఉంటారు.


ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ అన్ని కులాలను గౌరవిస్తానని  ఎన్నికల ముందు ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందరిని ఆకట్టుకున్నారు అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం సనాతన ధర్మం  కోసం అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటు హిందువులకు కూడా పిలుపునివ్వడం జరిగింది పవన్ కళ్యాణ్.. ఇక తిరుపతి లడ్డు వ్యవహారంలో పవన్ కళ్యాణ్ చేసిన హడావిడి దేశమంతటా కూడా చర్చనీయాంశంగా మారింది.

ఇదంతా ఇలా ఉండగా తాజాగా బక్రీద్ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ఒక ట్విట్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు లేని విధంగా ఇలా చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.. గోవులను పవిత్రంగా పూజించే సంస్కృతిలో మనము ఉన్నాము అటువంటి గోవులను వధించేందుకు చట్టాలు అంగీకరించవు అంటూ పవన్ కళ్యాణ్ పోస్టులో రాసుకురావడం జరిగింది. గోమతాలను రక్షించే దిశగా చట్టాలను అమలు చేస్తున్నామని.. అధికార యంత్రానికి ప్రజల సహకారం కూడా ఖచ్చితంగా అవసరమంటూ వెల్లడించారు. బక్రీద్ పండుగ తరుణంలో పవన్ కళ్యాణ్ ఈ విధంగా ట్విట్ చేసి ఉంటారంటూ పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ట్వీట్ పైన ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: