- ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )

ఆంధ్రప్రదేశ్లో గత ఏడాది జరిగిన ఎన్నికలలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి 70 వేల పై చిలు కు ఓట్ల భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి ఎంపిక కావడం ఇదే తొలిసారి. కూటమి పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ తన సీటు త్యాగం చేశారు. అయితే నాడు వర్మ చేసిన త్యాగం ఫలితంగా పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు అని చెప్పాలి. వ‌ర్మ కు చంద్రబాబు పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి యేడాది అవుతుంది. పిఠాపురంలో మాత్రం వర్మకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. పైగా నియోజకవర్గంలో జనసేనకు చెందిన ఇద్దరు ముగ్గురు నేతలకు కీలక పదవులు కూడా కట్టబెట్టారు .. పైగా నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చారు.


ఇప్పటికే అక్కడ జనసేన నాయకులు తో పాటు నాగబాబు లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలతో వర్మతో పాటు తెలుగుదేశం పార్టీ పార్టీ క్యాడర్ తీవ్ర మనస్థాపానికి గురైంది. రాష్ట్రవ్యాప్తంగా చాలామందికి పలు నామినేటెడ్ పదవులు దక్కుతున్న వర్మకు మాత్రం ఇంకా ఎలాంటి పదవి అయితే ఇప్పటివరకు దక్కలేదు. త్వరలో ఎమ్మెల్సీ పదవీ వర్మకు ఇవ్వని పక్షంలో ... లేదా వచ్చే ఎన్నికల వరకు ఇలాగే నాన్చి చివరలో వర్మకు ఏదైనా పదవి ఇచ్చినా తెలుగుదేశం పార్టీ క్యాడర్లో తీవ్ర అసహనం .. అసంతృప్తి రావటం ఖాయం. అదే జరిగితే వచ్చే ఎన్నికలలో పిఠాపురం తెలుగుదేశం వీరాభిమానులతో పాటు వర్మ అభిమానులు కచ్చితంగా జనసేనకు సపోర్ట్ చేయరు అని చెప్పాలి. అదే జరిగితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కష్టం అవుతుంది ... ఒకవేళ గెలిచిన మెజార్టీ దారుణంగా పడిపోతుంది. ఏది ఏమైనా వర్మ విషయంలో పవన బాధ్యత తీసుకొని ఎమ్మెల్సీ పదవి ఇప్పించకపోతే రాజకీయంగా పవన్ పిఠాపురంలో నష్టపోవడం ఖాయం.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: