రాష్ట్రంలో నేటి నుండి తల్లికి వందనం స్కీమ్  అమలవుతోంది.  ఈ స్కీమ్  అమలు కోసం ఏకంగా 8745 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు.  అయితే  రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 30  లక్షల మందికి ఎగనామం పెట్టిందంటూ  సాక్షి పత్రిక చెబుతోంది.  ప్రభుత్వం కేవలం 13 వేల రూపాయలు  మాత్రమే జమ చేయనుందని సాక్షి పత్రిక కథనంలో పేర్కొంది.  రాష్ట్రంలో 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే  దాదాపు 30 లక్షల మందికి నగదు జమ కావడం లేదని సాక్షి చెబుతోంది.

అయితే ఏ పథకం అమలు కావాలన్నా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి.  ప్రభుత్వం కేటాయించిన నిధులు 15 వేల రూపాయల చొప్పున పంపిణి చేస్తే కేవలం 58 లక్షల మందికి మాత్రమే సరిపోతాయని సాక్షి చెబుతోంది. అయితే రాష్ట్రంలో ఉన్న అందరు విద్యార్థులకు  స్కీమ్  అమలు చేస్తామని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు.  రేషన్ కార్డు ఉన్నవాళ్లకు మాత్రమే  ఈ స్కీమ్  అమలవుతుందని చెప్పవచ్చు.

సాక్షి పత్రిక కథనంలో  కొంతమేర  నిజం ఉన్నా  పూర్తి  నిజం అయితే లేదు. తల్లికి వందనం పథకం నగదు  ఎప్పటినుండి జమవుతుందనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.  తల్లికి వందనం స్కీమ్  విషయంలో నెలకొన్న సందేహాలకు సంబంధించి  చెక్  పెట్టే  దిశగా అడుగులు వేయాల్సి ఉంది.  తల్లికి వందనం పథకం వల్ల  ఎంతోమందికి ప్రయోజనం కలుగుతుందని చెప్పడంలో  సందేహం అవసరం లేదు.

అయితే  కూటమి సర్కార్ ఏ పథకాన్ని అమలు చేసిన సాక్షి పత్రిక నెగటివ్ కథనాన్ని రాస్తుంది అని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.  కూటమి సర్కార్ ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయి తెలియాల్సి ఉంది.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు
 

మరింత సమాచారం తెలుసుకోండి: