
అయితే ఇప్పుడు తాజాగా భూమా అఖిలప్రియ, మౌనిక మధ్య విభేదాలు వచ్చాయా అనే విధంగా చర్చించుకునేలా వార్తలు వినిపిస్తున్నాయి. దొర్నపాడు మండలం గోవిందిన్నే లో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి అఖిలప్రియ వెళ్లడం జరిగింది అయితే అక్కడ అనుకోకుండా ఈమె స్పృహ తప్పి పడిపోవడంతో వెంటనే ప్రాథమిక చికిత్స కోసం నంద్యాలలోని హాస్పిటల్ కి తరలించారు. ఇక మరుసటి రోజు ఆమెకు అన్ని పరీక్షలు చేయించి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని నిర్ధారించుకున్న తర్వాతే డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోయారు.
అయితే అదే ఉత్సవాలకు అఖిలప్రియ చెల్లెలు మౌనిక భర్త మనోజ్ కూడా వచ్చారు. అఖిల ప్రియ పెదనాన్న భూమా బ్రహ్మానందం రెడ్డి ఆహ్వానించడంతో ఈ జంట హాజరయ్యారట.. కానీ పెదనాన్న ఇంటికి మాత్రం అఖిలప్రియ వెళ్లలేదట. అయితే అదే ఊరిలోనే అఖిల ప్రియ పడిపోయిన అటు మంచు మనోజ్ గాని అఖిలప్రియ చెల్లెలు మౌనిక గాని పట్టించుకోకుండా అమ్మవారి దర్శనం చేసుకుని మరి వెళ్ళిపోయారనే విధంగా వినిపిస్తున్నాయి. అఖిల ప్రియని చాలామంది టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన.. ఈ ఘటన జరిగిన సమయంలో దగ్గరలో ఉన్న సొంత చెల్లి మౌనిక కూడా అఖిలప్రియను పరామర్శించకపోవడంతో ఇప్పుడు నంద్యాల రాజకీయాలలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది.
అంతేకాకుండా ఎలాంటి కార్యక్రమాలకు వెళ్లిన మౌనిక, మంచు మనోజ్ మాత్రమే వెళుతూ ఉన్నారు. మౌనిక తన అక్క అఖిలప్రియ ఇంటికి గత రెండేళ్లుగా వెళ్లలేదని వార్తలు వినిపిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తూ ఉంటే భూమా సిస్టర్స్ మధ్య విభేదాలు మొదలయ్యాయని అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. తన అస్వస్థకి గురైన కూడా తన చెల్లి మౌనిక, మనోజ్ పరామర్శించకుండా వెళ్లిపోయారని విషయం పైన అసహనాన్ని కూడా తెలియజేసినట్లు వినిపిస్తున్నాయి.ఈ విషయం పైన భూమా సిస్టర్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి.