
బాధిత కుటుంబాలకు ఎయిర్ ఇండియా అన్ని విధాలుగా అండగా నిలుస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. 2022 జనవరిలో టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను తమ చేతుల్లోకి తీసుకుంది. 2023 సంవత్సరంలో ఒక ఘటన వాళ్ళ ఎయిరిండియాకు 30,000 డాలర్ల అపరాధ రుసుమును డీజీసీఏ విధించింది. 2024 మార్చిలో సైతం డీజీసీఏ ఎయిర్ ఇండియాకు 80 లక్షల రూపాయల జరిమానా విధించడం జరిగింది.
కాశ్మీర్ అంశంపై ఉద్రిక్తతల సమయంలో ఎయిర్ ఇండియాకు అదనపు వ్యయాలు భారమయ్యాయని తెలుస్తోంది. పాత విమానాలలో లోపలి భాగాల నవీకరణ కోసం టాటా గ్రూప్ 400 మిలియన్ డాలర్లను కేటాయించగా అవసరమైన పరికరాల సరఫరా ఆలస్యమవుతోందని తెలుస్తోంది. మరోవైపు ఈ విమాన సర్వీసులు తరచూ ఆలస్యం అవుతున్నాయనే కామెంట్లు సైతం వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు కంపెనీకి ఆర్థిక నష్టాలు మాత్రం కొనసాగుతున్నాయని తెలుస్తోంది. తాజా దుర్ఘటనపై దర్యాప్తులో తేలే అంశాలే సంస్ట భవిష్యత్తును దిశా నిర్దేశం చేయనున్నాయి. మరోవైపు 171 నంబర్ కు గుడ్ బై చెప్పే దిశగా ఎయిర్ ఇండియా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. ఏఐ 171 కూలిపోవడం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు