
కర్నూలు జిల్లా హాలహర్విలో ఉండే గాడి లింగప్ప అనే వ్యక్తికీ ఏకంగా 94 మంది పిల్లలు ఉన్నట్టు రిజిస్టర్ అయింది. ఇతనికి 12.22 లక్షల రూపాయలు జమ కానున్నట్టు మెసేజ్ వచ్చింది. నంద్యాల జిల్లాలోని బెస్త సుజాత పేరిట 37 మంది పిల్లలు ఉన్నట్టు రిజిస్టర్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా చాల జిల్లాలో ఈ తరహా తప్పులతో కూడిన జాబితా వల్ల కొంతమంది అర్హత ఉన్నా ఈ స్కీమ్ ప్రయోజనాలను పొందలేని పరిస్థితి నెలకొంది.
ఈ తరహా తప్పుల నేపథ్యంలో ఎపి సర్కార్ జాబితాలను డీఈవోలకు పంపి విచారణ చేయిస్తోంది. ఈ లెక్కలు సరి చేస్తే లబ్ధిదారుల సంఖ్య కొంతమేర తగ్గే ఛాన్స్ ఉంది. అయితే ఈ తరహా తప్పులు జరగడానికి కారణం ఎవరు అనే ప్రశ్నలు సైతం సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కర్నూలు జిల్లాలో 20,806 పిల్లల పేర్లు తప్పుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆధార్ వివరాలు తప్పుగా ఉండటంతో ఎక్కువగా తప్పులు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 67 లక్షల మంది పిల్లలకు ఈ స్కీమ్ అమలవుతోంది. గత ప్రభుత్వంలో అమలైన అమ్మఒడి స్పూర్తితో తల్లికి వందనం స్కీమ్ అమలైంది. అన్నదాత సుఖీభవ స్కీమ్ మరో వారం రోజులలో అమలు కానుండటం గమనార్హం. తోలి విడతలో 7 వేల రూపాయలు రెండో విడతలో 7 వేల రూపాయలు మూడో విడతలో 6 వేల రూపాయలు జమ కానున్నాయి.