ఇటీవలే అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో కూలిన విమాన సంఘటనలో 272 మంది మరణించారు..మరువకముందే మరో కొన్నిచోట్ల షాకింగ్ ఘటనలు జరుగుతూ ఉన్నాయి. దీంతో విమాన ప్రయాణం చేయాలి అంటే చాలామంది ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా తెలంగాణలో ఒక షాకింగ్ ఘటన విమానం సాంకేతిక లోపం వల్ల చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. శంషాబాద్ నుంచి తిరుపతికి నిన్నటి రోజున రాత్రి వెళ్ళవలసిన ఒక విమానం లో పలు టెక్నికల్ ఇష్యూలు తలెత్తాయి. దీంతో విమానం ఆలస్యం కావడం వల్ల ప్రయాణికులంతా కూడా ఇబ్బందులకు గురైనట్లు తెలుస్తోంది.


స్పైస్టేట్ SG -2138 విమానం నిన్నటి రోజున (ఆదివారం) రాత్రి 7:30  శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి తిరుపతికి వెళ్లాల్సి ఉండగా అయితే విమానం గంట ఆలస్యంగా చేరుకుంది. దీంతో 8:30 నిమిషాలకు వచ్చింది. అనంతరం 65 మంది ప్రయాణికులతో తిరుపతికి బయలుదేరిన ఈ విమానం ఇంజన్ స్టార్ట్ చేసి రన్వే వైపు మెల్లగా వెళ్ళింది. ఈ క్రమంలోనే ఇంజన్ నుంచి దట్టమైన పొగలు రావడం మొదలయ్యాయి.. అయితే ఈ విషయాన్ని గమనించిన పైలెట్ ATC అధికారులకు వెంటనే సమాచారాన్ని ఇవ్వడంతో హుటాహుటిగా ఆ సంఘటన స్థలానికి అధికారులు చేరుకున్నారు.


ఇంజన్ లో ఉన్న టెక్నికల్ ఇష్యు వల్ల ఈ పొగ రావడం జరిగిందని.. అయితే టెక్నికల్ ప్రాబ్లంని సాల్వ్ చేసి ప్రయాణికులను దించేందుకు మళ్లీ ఇంజన్ ని స్టార్ట్ చేయగా ఏదో వాసన రావడాన్నీ పైలెట్ గుర్తించి విమానాన్ని నిలిపివేశారు. ఈ ఘటన వల్ల ప్రయాణికులు ఆందోళన చెందడంతో అక్కడ సిబ్బంది ప్రయాణికులను ఆందోళన పడవద్దని విమానం బయలుదేరడానికి మరికొంత సమయం పడుతుందని సుమారుగా మూడున్నర గంటల పాటు అక్కడే ప్రయాణికులను ఉంచి ఆ తర్వాత రాత్రి 10:54 గంటలకు తిరిగి తిరుపతికి బయలుదేరి క్షేమంగా దించి మరి విమానం వెళ్ళిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: