
ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు . ఆ పోస్ట్ సెకండ్స్ లోనే వైరల్ గా మారిపోయింది ."అవాంతరాలు లేని హైవే ప్రయాణం కోసం జరుగుతున్న మార్పులలో ఇది నిజంగా ఒక కీలకమైన ఆడుగానే చెప్పాలి. జస్ట్ మూడు వేల ధరతో ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ పరిచయం చేస్తున్నాం. దీని ద్వారా ప్రతి ఒక్క వాహనదారులు మంచి లాభాన్ని పొందుతారు. అంతేకాదు ఇది ఆగస్టు 15 2025 నుంచి అమల్లోకి వస్తుంది . ఈ పాస్ యాక్టివేషన్ తేదీ నుంచి ఒక సంవత్సరం లేదా 200 ట్రిప్పుల వరకు ఇది చెల్లుబాటు అవుతుంది. ఏది ముందు వస్తే అదే కౌంట్లోకి తీసుకుంటారు. ఈ పాస్ కార్లకు జీపులకు వ్యాన్లకు వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాలకు ఉపయోగకరంగా ప్రత్యేకంగా రూపొందించం " అంటూ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
అలాగే ణాఈ, ంఒఋఠ్ అధికారిక వెబ్‌సైట్లలో ఇది అందుబాటులోకి తీసుకొస్తామని కూడా తెలిపారు. అంతేకాదు ఏడాది పాస్ తీసుకున్న తర్వాత ..దాన్ని యాక్టివేషన్, అప్డేషన్ వంటివి సమాచారం ఆన్‌లైన్ ద్వారా సులభంగా చేసుకోవచ్చు అంటూ కూడా తెలిపారు. ఈ కొత్త విధానం టోల్ ప్లాజా వద్ద గంటలు గంటలు వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తందని అభిప్రాయపడ్డారు. దీంతో రద్దీ తగ్గుతుంది అని కూడా పేర్కొన్నారు. టోల్ ప్లాజాల వద్ద వివాదాలు కూడా సగం మేరకు తగ్గుతాయని రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఈ విధంగా దేశంలోని లక్షలాది మంది వాహనదారులు ఇక వేగవంతమైన, సులభమైన ప్రయాణ అనుభవాన్ని ఆస్వాదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. ఈ వార్షిక పాస్ లక్ష్యం కూడా ఇదేనని తెలిపారు.