
ముఖ్యంగా చెవిరెడ్డి నగదు లావాదేవీల పైన విచారణ చేస్తున్నట్లు సమాచారం. జులై 1వ తేదీ వరకు రిమాండ్ల విధించారు. అలాగే చెవిరెడ్డి తో పాటు వెంకటేష్ నాయుడును కూడా విచారించబోతున్నారు. అయితే సీట్ అధికారులు కూడా మూడు గంటల పాటు విచారణ జరిపించారట. చెవిరెడ్డిని విచారణ చేసే సమయంలో కూడా సమాధానాలు చెప్పకుండా ఎదురు ప్రశ్నలు వేసినట్లు చెవిరెడ్డి వార్తలు వినిపిస్తున్నాయి. విచారణ సమయంలో అధికారులను ఎలాంటి ప్రశ్నలు వేశారు అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉన్నది.
చదివి మరి సంతకాలు పెట్టమని కొన్ని డాక్యుమెంట్లను చెవిరెడ్డికి ఇచ్చినప్పటికీ వాటిని చించేసినట్లుగా తెలుస్తోంది.. చెవిరెడ్డి, వెంకటేష్ నాయకులను ఏసీబీ కోర్టులో హాజరు పరిచిన తర్వాత సిట్ అధికారులు సైతం దర్యాప్తు చేసినటువంటి వీడియోను కూడా ఏసీబీ అధికారులు కోర్టులో అప్పగించినట్లు సమాచారం. మద్యం కుంభకోణం కేసులో తాను విచారణకు సహకరిస్తారని చెప్పినప్పటికీ కూడా చెవిరెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారంటూ చెవిరెడ్డి న్యాయవాది కోర్టుకు విన్నవించుకున్నారు. అంతేకాకుండా విచారణలో తాము చెప్పిన సమాధానాలను కాకుండా సొంతంగా రాసుకున్నారంటూ వెల్లడించారు. తాజాగా హాస్పిటల్ లో ఉన్న చెవిరెడ్డి వైద్య పరీక్షలు అనంతరం చెవిరెడ్డి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని విషయం తెలుసుకున్న తర్వాతే తదుపరి నిర్ణయం ఏంటది చూడాలి మరి