అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ చాలా చాలా మొండోడు . ఎంత మండోడు అంటే ఆయన తీసుకున్న డెసిషన్ విషయంలో ఏ మాత్రం వెనక్కి రాడు.  చూస్తాడు చూస్తాడు చూస్తాడు తిక్క రేగిందా చంపి అవతల పార దొబ్బుతాడు.  దెబ్బకు పోయిరా పీడ విరగడయిపోయింది అనుకునే టైపు.  అలాంటి కోపం ఉన్న డోనాల్డ్ ట్రంప్ కి అమెరికా అధ్యక్షుడి బాధ్యతలు చేతికి వస్తే ఇంకేంటి ప్రపంచ దేశాలు గజగజ వణికి పోవాల్సిందే . ఈ మధ్యకాలంలో ఇండియా పై కూడా ఎలా ట్రావెల్ కండిషన్స్ పెట్టాడో అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని దేశాలపై పగ పట్టినట్లు బిహేవ్ చేస్తున్నాడు .


ఇలాంటి మూమెంట్లోని డోనాల్డ్ ట్రంప్ మరొకసారి తన క్యారెక్టర్ ని బయట పెట్టాడు.  ఇరాన్ అణుస్ధావరాలపై దాడి చేయించి సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యాడు.  ఇదే విషయాన్ని డోనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించాడు . ఇరాన్ అణు స్దావరాళ్లపై B2 స్పిరిట్ స్టెల్త్ బంబర్ ల ను ఉపయోగించినట్లు అమెరికా అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి.  అయితే ఈ బాంబర్ స్పెషాలిటీస్ ఏంటి అనే విషయం ఇప్పూదు ఇంటర్ నెట్ లో బాగా ట్రెండ్ అవుతున్నాయి.


అమెరికా - ఇరాన్ పై ఉపయోగించిన B2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ల ను మృత్యుదూతగా పేర్కొంటున్నారు . అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానంగా ఇది గుర్తింపు దక్కించుకుంది.  B2 స్పిరిట్ నిర్మాణ ఖర్చు 2.1 బిలియన్ల డాలర్లకు పైగానే ఉంటుందట . సోవియట్ పతనం తర్వాత నార్త్రోప్ గ్రూమన్ తయారు చేసినట్లు తెలుస్తుంది . అంతేకాదు ఈ బాంబర్ల స్పెషాలిటీ ఏంటంటే రిఫ్యువల్ లేకుండా 6000 నాటీక్ల్ మైళ్ల దూరం ప్రయాణించగలవు. అంతేకాదు ఇవి సౌండ్ లేకుండా పనిచేస్తాయి . దీని మెయిన్ స్పెషాలిటీ ఇదే .


జిపిఎస్ ఆధారిత సాంకేతికతో భూగర్భ అణు కేంద్రాలను కనిపెట్టి మరీ ధ్వంసం చేస్తాయి . ఆ విధంగానే వీటిని రూపొందించారు . అత్యంత శక్తివంతమైన బాంబులను ప్రయోగించే B 2 స్పిరిట్ బరువు సుమారు 14 టన్నులు పైగానే ఉంటుంది . 200 అడుగులు దూరంలో సురక్షిత కాంక్రీట్ పైభాగాన్ని కూడా విజయవంతంగా ఇది ఛేదించగలదు.  ఒక మిషన్ లో ఒకటి లేదా రెండూ మాత్రమే B2 లను  వాడే అవకాశం ఉంటుంది అంటూ కూడా చెబుతున్నారు.


ఈ బాంబులు భూగర్భంలో ఉన్న లక్ష్యాలను ఈజీగా ధ్వంసం చేయగలదు . అందుకే ఫోర్డ్  భూగర్భ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నప్పుడు B2 బాంబర్ ల ను ఎంచుకున్నారు . శత్రువు రక్షణ వ్యవస్థలకు చుచ్చుకెళ్లే సామర్థ్యం వీటికి ఉంటుంది . ఈ బాంబర్ రహస్యంగా దాడులు చేయగలదు . ఎటువంటి సౌండ్ లేకుండా శత్రువు రాడర్లకు దొరకకుండా లక్ష్యాలను ధ్వంసం చేయగలగే విధంగా దీన్ని రూపొందించారు . 1989లో తొలిసారి ఈ బాంబర్ ఉపయోగించారు . ఇప్పటికి  ప్రపంచంలో అత్యంత సురక్షితమైన విమానాలలో ఇది ఒకటిగా ఉండడం విశేషం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: