- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

వైసీపీ అధినేత , మాజీ ముఖ్య‌మంత్రి , పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి కి విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఎక్స్ లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. లోకేష్ జ‌గ‌న్ కు ఇచ్చిన కౌంట‌ర్ ఇప్పుడు సోష‌ల్ మీడియా లో బాగా వైర‌ల్ అవుతోంది. మీ ఏడుపులే మాకు దీవెనలు జగన్ మోహన్ రెడ్డి గారు . . ! మీరు ఐదేళ్లు విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసి పోయారు. నేను ఏడాదిలోనే అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిన పెట్టడం చూసి మీకు కడుపుమంట రావడం సహజం అని తెలిపారు. మీ హయాంలో ఎప్పుడు కౌన్సిలింగ్ పెట్టారో కూడా మీకు స్పృహ లేదు. కోవిడ్ తరువాత మీరు 2022 సెప్టెంబర్‌లో, 2023 జూలై చివరికి ఈసెట్ కౌన్సిలింగ్ పూర్తి చేసిన మీరు మమ్మల్ని విమర్శించటం మీ అజ్ఞానానికి నిదర్శనం అని లోకేష్ కౌంట‌ర్ ఇచ్చారు. మేము ప్రభుత్వంలోకి రాగానే ఈసెట్ మొదటి కౌన్సిలింగ్‌ని జూలై మూడో వారం కల్లా పూర్తి చేసాము. ఈ సంవత్సరం కూడా మొదటి కౌన్సిలింగ్‌ని జూలై మూడో వారానికి పూర్తి చేస్తాము అని లోకేష్ స్ప‌ష్టం చేశారు.


ఇక పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో లోకేష్ మాట్లాడుతూ గ‌త అధికారి పార్టీకి 151 సీట్లు 11 అయ్యాయంటే దానికి కారణం వారి అహంకారం అని ..
గడిచిన ఐదేళ్ళలో ఇక్కడ ఉన్న నేతలందరిపైనా అప్పటి పాలకపక్షం కేసులు పెట్టింది. శనివారం వస్తే ఎవరి గోడ పగలకొడతారో, ఎవరి ఇల్లు కూల్చుతారో, ఎవరిని జైలుకు తీసుకెళతారో తెలియని పరిస్థితి. ఇవాళ సెల్యూట్ కొట్టే పోలీసులే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు పెట్టారు. ఇబ్బంది పెట్టారని .. మ‌నం మాత్రం అలాంటి పాల‌న చేయం అని తెలిపారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: