కర్ణాటక సీఎం సీతారామయ్య సూచనల మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రోహిత్ వేముల పేరుతో ఒక బిల్లును సైతం సిద్ధం చేసింది ఈ బిల్లును ఈ వర్షాకాలపు సమావేశాలలో కర్ణాటక ప్రభుత్వం  ప్రవేశపెట్టేలా భావిస్తున్నది. 2016లో కుల వివక్ష కారణంగా హైదరాబాదులో సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్న   దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నారు.. ఈ విద్యార్థి దళితుడైనందువల్లే వేధింపులు గురయ్యారని అందుకే ఆత్మహత్య చేసుకున్నారనే విధంగా రాజకీయాల పరంగా పెను దుమారం రేపింది. రోహిత్ వేముల  బిల్లు 2025లో కర్ణాటక ప్రభుత్వం రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలలో కూడా విద్యార్థులు ఎవరు కూడా ఎలాంటి వివక్షత చూపించకూడదని కాంగ్రెస్ నేతలు రోహిత్ వేముల బిల్లును తీసుకువచ్చినట్లుగా తెలియజేస్తున్నారు.


రోహిత్ వేముల బిల్లు .. ఎస్సీ, ఎస్టి ఇతర వెనుకబడిన తరగతులు, మైనార్టీలకు చెందిన విద్యార్థులు, మత ఆధారంగా బహిష్కరణ అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలనే లక్ష్యాన్ని కర్ణాటక ప్రభుత్వం పెట్టుకుంది.. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులను రానివ్వకపోవడం వారి నుంచి డబ్బులు డిమాండ్ చేయడం వంటివి లేకుండా చేయడానికి చూస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. పైన చెప్పిన వర్గాల విద్యార్థుల పైన ఏదైనా నేరం రుజువు అయితే బెయిల్  లేని కేసులను నమోదు చేసేలా కర్ణాటక ప్రభుత్వం తీసుకు వచ్చింది.


ఎవరైనా వారి మీద వివక్ష చూపిన, వివక్ష చూపిన వారికి సహాయం చేసిన కూడా శిక్షకు గురవుతారట. ఇలాంటి కేసులను వేగవంతం చేయడం కోసం ప్రత్యేకించి మరి కోర్టులను ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి హైకోర్టులో ప్రతి బెంచ్ లో కూడా ఒకరిని నియమించేందుకు ఈ రోహిత్ బిల్లు వీలు కల్పిస్తోంది.


రోహిత్ వేముల బిల్లు ఆమోదం పొందిన తర్వాత మొదటిసారి ఏదైనా కేసు రుజువు అయితే ఏడాది పాటు జైలు శిక్ష పదివేల రూపాయలు జరిమానా అలాగే బాధితుడికి లక్ష రూపాయల వరకు పరిహారం అందించేలా ఉంటుందట. ఒకవేళ ఈ చట్టం కింద మరొకసారి నేరం రుజువైతే మూడేళ్లు జైలు శిక్ష లక్ష రూపాయలు జరిమానా. అలాగే విద్యాసంస్థలు ఏవైనా సరే ,మతాలు, కులాలు, లింగం ,జాతి వివక్షత వంటివి రూల్స్ ఉల్లంఘిస్తే ఇదే శిక్ష పడుతుందట.


ఏప్రిల్ నెలలో రాహుల్ గాంధీ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఒక లేఖ లేఖ రాస్తూ రోహిత్ వేముల పేరుతో ఒక చట్టాన్ని తీసుకురావాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా రోహిత్ వేముల బిల్లుని పేర్కొంది. వీటిని అమలు చేసేందుకే నేతలు చర్యలు తీసుకుంటున్నారు త్వరలో అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: