గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో తన సీటు త్యాగం చేశారు మాజీ ఎమ్మెల్యే వర్మ. సీటు త్యాగం చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ ను భారీ మెజార్టీతో గెలిపించడంలో తన వంతుగా కృషి చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు వర్మ‌కు ఎమ్మెల్సీ ఇస్తానని బహిరంగంగా హామీ ఇచ్చారు. అటు పవన్ కళ్యాణ్ కూడా వర్మ కు ఎమ్మెల్సీ ఇవ్వటంలో తాను ముందుండి బాధ్యత తీసుకుంటానని చెప్పారు. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. పవన్ కళ్యాణ్ సోద‌రుడు నాగబాబుకి కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇప్పటివరకు వర్మకు ఎలాంటి పదవి రాలేదు. తాజాగా ఆయనను పార్టీ పెద్దలు పిలిపించి ఎమ్మెల్సీ పదవి తప్ప మరొకటి కోరుకోమని చెబుతున్నట్టుగా తెలుస్తోంది.


2019లో పిఠాపురంలో వర్మ ఓడిపోయినప్పటి నుంచి ఐదేళ్లపాటు చాలా కష్టపడ్డారు. వర్మ చివరలో ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. 2014లో చంద్రబాబు టిక్కెట్ ఇవ్వకపోతే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయం సాధించారు. మొన్న ఎన్నికల్లోను వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే పవన్ కు అంత మెజార్టీ వచ్చేదే కాదు. గెలుపు కోసం చెమటోడ్చాల్సి వచ్చేది. ఆ తర్వాత చంద్రబాబు పలువురికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిన వర్మకు మాత్రం ఇవ్వలేదు. తాజాగా వర్మను ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలిచి మాట్లాడారు. ఈ భేటీలో మంత్రి నారాయణ కూడా ఉన్నారు. అయితే నియోజకవర్గంలో టిడిపి పూర్తిగా దెబ్బతిని పోతుందని వర్మ చంద్రబాబు వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. చంద్రబాబు మాత్రం ఎమ్మెల్సీ పదవి తప్ప ఇంకేమైనా అడగాలని సూచించినట్టుగా వినిపిస్తోంది. ఏదేమైనా వ‌ర్మ అడ్డం తిరిగితే పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ స్టార్ట్ అయిన‌ట్టే అనుకోవాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: