ఇండియా కూటమి కట్టి ఎన్డీఏ ని ఓడించాలని చేసిన ప్రయత్నాలు ఎవరికి వారే అన్నట్టుగా మారిపోవడంతో ఆ కూటమిలోని పార్టీలు అన్ని ఎవరిదారి వాళ్ళు చూసుకుంటున్నారు. రాష్ట్రాలవారీగా పొత్తులు ఉన్న పార్టీలు మాత్రమే ఇప్పుడు జాతీయ స్థాయిలో ఇండీ కూటమి అని చెప్పుకుంటున్నాయి. కానీ అలాంటి ప్రభావం ఏం కనిపించడం లేదు. తాజాగా కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ తాము ఇండి కూటమిలో భాగం కాదు అని చెప్పేసింది. దీంతో ఇండి కూటమి మరింత బలహీన పడినట్లు అయింది. ఆమ్ పార్టీ రాకతో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పునాదులు కోల్పోయింది. ఇప్పుడు ఢిల్లీలో ఆ పార్టీ పరిస్థితి ఏపీలో కాంగ్రెస్ లా అయిపోయింది. తర్వాత ఇండీ కూట‌మి లో చేరారు. కేజ్రీ వాల్‌కు కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాలలో సీట్లు ఇవ్వటానికి నిరాకరించింది. హరియానాలో సీట్లు ఇవ్వకపోవడంతో ఒంటరిగా పోటీ చేశారు. అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది.


హర్యానాలో పొత్తు వద్దు అనుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో పొత్తులు కేజ్రీవాల్ వద్దు అనుకున్నారు. అక్కడ కేజ్రీవాల్ ఓడిపోయారు. ఇక ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్తో కలిసి పోటీ చేసేది లేదని ఆయన చెబుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నీడ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నారు. ఇండియా కూటమిక క‌కావిక‌లం అయింది. పార్లమెంటు సమావేశాలకు ముందు ఇండి కూటమి మీటింగ్లో పాల్గొనేదే లేదని ఆప్‌ ప్రకటించింది. బిజెపి నుంచి ఇంకా పూర్తిస్థాయిలో దాడులు ఎదుర్కోలేమన్న ఓ కారణం కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి దూరం కావటానికి ఓ కారణం అనుకోవచ్చు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: