
భారత్ పైన ఏకంగా 50% టారిఫ్ విధించడం వల్ల ఎగుమతులు అమాంతం తగ్గిపోయాయి. ఇప్పుడు వరుసగా 3 నెలలో కూడా ఈ ఎగుమతులు తగ్గిపోయాయి. గడిచిన జులై నెలలో ఎగుమతులలో 3.6% తగ్గిపోగా జూన్ నెలలో 5.7% క్షీణించిపోయాయి. భారత్ ఎగుమతులు మే నెలలో అమంతం 4.8% పెరిగిన 8.8 బిలియన్ డాలర్లకు చేరింది. ట్రంప్ పెంచిన టారిఫ్ వల్ల అమెరికా మార్కెట్లో ఇండియా వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయి. దీంతో అక్కడ ఇండియా ఉత్పత్తులకు భారీగా డిమాండ్ తగ్గిందంటూ కొన్ని సంస్థలు వెల్లడించాయి. ఈ ఏడాది ఆగస్టు 7న భారత్ పై అమెరికా 25% టారిఫ్ పెంచగా ఆ తర్వాత వెంటనే 25నుంచి 50 శాతానికి పెంచింది.
అయితే ఇలా పెంచడానికి ముఖ్య కారణం రష్యా నుంచి ఇండియా చమురు కొనుగోలు చేస్తూందని సాకుతో అమెరికా భారీగా టారిఫ్ లు పెంచేసింది. గత మూడు నెలల ఎగుమతుల గణాంకాలను పరిశీలించగా సెప్టెంబర్ నెలలో ఎగుమతులు పతాక స్థాయికి పడిపోయాయని విశ్లేషకులు తెలుపుతున్నారు. వస్త్రాలు, ఆభరణాలు, రొయ్యలు, కార్పెట్లు, తోలు ఇతర రంగాలపైన భారీగా సుంకాలు విధించాయి.. ఇదే పద్ధతి కొనసాగితే మాత్రం అమెరికా ఎగుమతులలో 30 నుంచి 35 బిలియన్ డాలర్లు ఇండియా కోల్పోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇది ఇండియా వాణిజ్య లోటును కూడా తీవ్రంగా పెంచేస్తుందని తెలియజేస్తున్నారు. ఇండియా నుంచి మొత్తం ఎగుమతులలో 20% వరకు అమెరికాకి వెళుతున్నట్లు తెలియజేస్తున్నాయి.