ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్ తో సహా కొన్ని ప్రాంతాలలో చిన్నపిల్లల మరణాలకు దగ్గు సిరప్ లే కారణమవుతున్నాయని వైద్య నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. దీనివల్ల కొన్ని ప్రాంతాలలో కూడా ఈ సిరప్లను ఉపయోగించకూడదంటూ బ్యాన్ చేశాయి ప్రభుత్వాలు. ఇప్పుడు తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా చిన్నారులలో తీవ్రమైన రోగాల్ని, మరణాలను కలిగించేటువంటి ప్రమాదకరమైన దగ్గు మందులను కూడా నిషేధించింది. ఆ రెండు మందులు ఏవంటే.. RELIFE CF, RESPIFRESH -TR వంటి సిరప్ లను వాడవద్దు అంటూ తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణలోని అన్ని హాస్పిటల్స్, ఫార్మసీలకు సైతం ఈ నిషేధాన్ని వెంటనే అమలు చేయాలి అంటూ సూచించారు.


ఈ రెండు సిరప్ చిన్నపిల్లలకు చాలా విషపూరితమైన గ్లైకాల్ (DEG) ఉందంటూ తెలియజేశారు. ఇందుకు సంబంధించి వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలి అంటూ ఉత్తర్వులను కూడా జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, కోల్డ్ రిఫ్(SR -13) సిరప్  కారణంగా ఏకంగా 16 మంది చిన్నారులు మరణించిన సంఘటన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయి  వెంటనే ఆ బ్యాచ్ సిరప్లను సీజ్ చేయాలి అంటూ డ్రగ్ ఇన్స్పెక్టర్లకు ఉత్తర్వులను జారీ చేసింది. ఇక మీదట డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా ఎవరూ కూడా పిల్లలకు దగ్గు ,జలుబు సిరప్లను ఇవ్వకూడదంటూ సూచించారు.


దీంతో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలకు కూడా అప్రమత్తమై వీటిని తమ ప్రాంతాలలో కూడా బ్యాన్ చేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. అయితే మధ్యప్రదేశ్లో దగ్గు సిరప్ తాగి పిల్లలు మరణించారనే ఆరోపణల పైన సిబిఐ దర్యాప్తు కోరుతూ నిన్నటి రోజున సుప్రీంకోర్టులో ఫీల్ దాఖలు చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా ఈ దగ్గు సిరప్ ల పైన పరీక్షా నియంత్రణ, అలాగే తయారీ, పంపిణీ పైన రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో ఈ దర్యాప్తును జరపాలంటూ ఫిల్ లో కోరారు. ఈ కంపెనీ తయారు చేసేటువంటి అన్ని మందులు అమ్మకాలు పంపిణీల పైన నిషియాదించాలని డిమాండ్ ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: