
ఇక ప్రస్తుతం టాలీవుడ్‌లో చరణ్, తారక్, ప్రభాస్, బన్నీ వంటి స్టార్ హీరోలు ఒక్కో సినిమా కోసం 100 నుంచి 150 కోట్ల వరకు తీసుకుంటూ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. వీళ్లకు ఉన్న ఫ్యాన్ బేస్, మార్కెట్, క్రేజ్ అన్నీ అద్భుతమే అయినా — కంటెంట్ పరంగా అయితే చాలా మంది ప్రేక్షకులు అసంతృప్తిగా ఉన్నారు. “వీళ్లు సినిమాలు చేస్తున్నది తమ క్రేజ్ కోసం మాత్రమే… కానీ జనాలకు ఏం ఉపయోగం?” అంటూ కొంతమంది సినీ ప్రేమికులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.ఇదే సమయంలో ఒక హీరో మాత్రం అందరికీ ఉదాహరణగా నిలుస్తున్నాడు . ఆయనే నాని. ఆయన స్టార్ కిడ్స్‌లా ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి, తన కష్టంతో, టాలెంట్‌తో ఈ స్థాయికి చేరుకున్నారు. ఆయన సినిమాలల్లో ప్రతి సారి కొత్తదనం కనిపిస్తుంది. ఒకసారి లవ్ స్టోరీ అయితే, మరోసారి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ, తర్వాత సస్పెన్స్ లేదా సోషల్ డ్రామా — ప్రతి సినిమా వేరే కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను కనెక్ట్ అయ్యేలా చేస్తారు. అందుకే నాని ఫ్యాన్స్ గర్వంగా చెబుతున్నారు – “ఇండస్ట్రీలో రియల్ హీరో అంటే నానినే!” అంటున్నారు.
నాని సినిమాలు చూసే వారు అతనిలోని యాక్టర్ మాత్రమే కాదు, ఒక సెన్సిబుల్ హ్యూమన్ బీయింగ్‌ను కూడా గుర్తిస్తారు. ఆయన పాత్రలలో జీవితం ఉంటుంది, మాటలలో నిజం ఉంటుంది. అందుకే ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా, ప్రేక్షకుల మనసుల్లో నాని పేరు ఎప్పుడూ నిలిచిపోతుంది.ఇప్పుడు అభిమానులు, సినీ ప్రేక్షకులు అడుగుతున్న ప్రశ్న ఇదే — చరణ్, తారక్, ప్రభాస్, బన్నీ వంటి స్టార్ హీరోలు ఎందుకు నాని లాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేయలేకపోతున్నారు? ఎందుకు వారు కూడా తమ క్రేజ్‌తో పాటు ప్రజలకు మెసేజ్ ఇచ్చే సినిమాలు చేయాలని ఆలోచించడం లేదు? ఈ ప్రశ్న ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేస్తోంది.సినిమా అంటే కేవలం మాస్ ఎంటర్టైన్‌మెంట్ కాదు, అది సామాజిక బాధ్యత. హీరోలు కూడా ఆ బాధ్యతను గుర్తించి — కేవలం హై ఇవ్వే సినిమాలు కాదు, హార్ట్ టచ్ చేసే కథలు కూడా చేయడం మొదలు పెడితే, తెలుగు సినిమా మరో కొత్త స్థాయికి వెళ్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు..!