
అయితే రేపటి రోజున నర్సీపట్నం పర్యటనను దళిత సంఘాలు అడ్డుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు. మెడికల్ కాలేజీల పర్యటనకు నర్సీపట్నం వచ్చే ముందు గతంలో వైసిపి హయాంలో మరణించిన అనస్తిషియా డాక్టర్ సుధాకర్ కుటుంబానికి జగన్ క్షమాపణలు చెప్పాలంటు కోరారు. డాక్టర్ సుధాకర్ తల్లికి ,వారి కుటుంబ సభ్యులకు జగన్ ఫోన్ చేసి క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. కరోనా సమయంలో మాస్క్, కిట్ అడిగితే అందించలేని మీరు ఇప్పుడు మెడికల్ కాలేజీలు కడతానంటే ఎలా నమ్మాలి అంటూ దళిత సంఘాలు సైతం జగన్ ని ప్రశ్నిస్తున్నాయి.
వైద్యుడు ప్రాణాలు కాపాడలేని వారు మెడికల్ కాలేజీలను ఎలా నిర్మిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు?. అంతేకాకుండా డాక్టర్ సుధాకర్ మృతి పైన వెంటనే సిబిఐ విచారణ జరిపించాలి అంటూ దళిత సంఘాలు కూడా కోరుతున్నాయి. ఒకవేళ జగన్ సుధాకర్ కుటుంబానికి క్షమాపణలు చెప్పకపోతే ఖచ్చితంగా ఈ పర్యటనను అడ్డుకొని తీరుతామంటూ దళిత సంఘాలు వార్నింగ్ ఇస్తున్నాయి. అప్పట్లో డాక్టర్ సుధాకర్ ప్రభుత్వంతో తనకి ఎలాంటి విభేదాలు లేవంటూ ప్రకటించారు. కానీ అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించడంతో ఈ విషయం పైన సిబిఐ విచారణ జరిపిన కూడా ఎటువంటి విషయం బయటపడలేదు. మరి ఇప్పుడు దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్న ఈ విషయంపై జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.